మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రియైన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలోనుండి యేసుక్రీస్తు తిరిగి లేచుటవలన జీవముతోకూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడ బారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరముచొప్పున మనలను మరల జన్మింప జేసెను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు, విశ్వాసముద్వారా దేవుని శక్తిచేత కాపాడబడు మీకొరకు, ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడియున్నది.
చదువండి 1 పేతురు 1
వినండి 1 పేతురు 1
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: 1 పేతురు 1:3-5
7 రోజులు
మన విమోచన కొరకు దేవుడు క్రీస్తును పంపించడంలో చేసినదానినంతటిని పునరాలోచనతో ధ్యానించుకొనడానికి క్రిస్టమస్ ఒక సంపూర్ణమైన సమయం. మీరు ఈ ధ్యానాన్ని చదువుతూ ఉండగా, మీరు మీ స్వంత విమోచనను జ్ఞాపకం చేసుకుంటూ, మీ ముందు ఉన్న బాటమీద మీరు నిశ్చయతతో నడవడం కొరకు ఆయన మిమ్మల్ని మళ్లీ అన్నిటినుండి విమోచిస్తాడని నా ప్రార్థన.
28 రోజులు
యేసు ఆగమనం లేదా రాకను జరుపుకోవడానికి వ్యక్తులు, చిన్న సమూహాలు మరియు కుటుంబాలను ప్రేరేపించడానికి బైబిల్ ప్రాజెక్ట్ ఆగమన ధ్యానములును రూపొందించింది. ఈ నాలుగు వారాల ప్రణాళికలో పాల్గొనేవారికి నిరీక్షణ, శాంతి, ఆనందం మరియు ప్రేమ యొక్క బైబిల్ అర్థాన్ని అన్వేషించడానికి సహాయపడే యానిమేటెడ్ వీడియోలు, సంక్షిప్త సారాంశాలు మరియు ప్రతిబింబించే ప్రశ్నలు ఉంటాయి. యేసు ద్వారా ఈ నాలుగు ధర్మాలు ప్రపంచానికి ఎలా వచ్చాయో తెలుసుకోవడానికి ఈ ప్రణాళికను ఎంచుకోండి.
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు