అప్పుడు సీయోను అను దావీదు పురములోనుండి యెహోవా నిబంధనమందసమును పైకి తీసికొని వచ్చుటకు యెరూషలేములోనుండు రాజైన సొలొమోను ఇశ్రాయేలీయుల పెద్దలను గోత్రప్రధానులను, అనగా ఇశ్రాయేలీయుల పితరుల కుటుంబముల పెద్దలను తనయొద్దకు సమకూర్చెను. కాబట్టి ఇశ్రాయేలీయులందరును ఏతనీ మను ఏడవ మాసమందు పండుగకాలమున రాజైన సొలొమోను నొద్దకు కూడుకొనిరి. ఇశ్రాయేలీయుల పెద్దలందరును రాగా యాజకులు యెహోవా మందసమును ఎత్తి దాని తీసికొనివచ్చిరి. ప్రత్యక్షపు గుడారమును గుడారములోనున్న పరిశుద్ధ ఉపకరణములను యాజకులును లేవీయులును తీసికొనిరాగా రాజైన సొలొమోనును అతనియొద్దకు కూడి వచ్చిన ఇశ్రాయేలీయులగు సమాజకులందరును మందసము ముందర నిలువబడి, లెక్కింప శక్యముగాని గొఱ్ఱెలను ఎడ్లను బలిగా అర్పించిరి. మరియు యాజకులు యెహోవా నిబంధనమందసమును తీసికొని దాని స్థలములో, అనగా మందిరపు గర్భా ల యమగు అతిపరిశుద్ధ స్థలములో, కెరూబుల రెక్కల క్రింద దానిని ఉంచిరి. కెరూబుల రెక్కలు మందస స్థానము మీదికి చాపబడెను, ఆ కెరూబులు మందసమును దాని దండెలను పైతట్టున కమ్మెను. వాటి కొనలు గర్భాల యము ఎదుట పరిశుద్ధ స్థలములోనికి కనబడునంత పొడ వుగా ఆ దండెలుంచబడెనుగాని య వి బయటికి కనబడలేదు. అవి నేటివరకు అక్కడనే యున్నవి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములోనుండి వచ్చినప్పుడు యెహోవావారితో నిబంధనచేయగా మోషే తాను హోరేబునందు ఆ పలకలను మందసములో ఉంచెను. దానిలో ఆ రెండు రాతిపలకలు తప్ప మరి ఏమియు లేక పోయెను. యాజకులు పరిశుద్ధస్థలములోనుండి బయటికి వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను. కాబట్టి యెహోవా తేజోమహిమ యెహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువుచేత యాజకులు సేవచేయుటకు నిలువలేక పోయిరి. సొలొమోను దానిని చూచి గాఢాంధకారమందు నివాసము చేయుదునని యెహోవా సెలవిచ్చియున్నాడు. నీవు నివాసము చేయుటకు నేను మందిరముకట్టించియున్నాను; సదాకాలము అందులో నీవు నివసించుటకై నేనొకస్థలము ఏర్పరచియున్నాను అని చెప్పి తన ముఖమును ప్రజలతట్టు త్రిప్పుకొని, ఇశ్రాయేలీయుల సమాజమంతయు నిలిచియుండగా ఇశ్రాయేలీయుల సమా జకులందరిని ఈలాగు దీవించెను. నా తండ్రియైన దావీదునకు మాట యిచ్చి దాని నెరవేర్చిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలిగియుండును గాక. –నేను ఇశ్రాయేలీయులగు నా జనులను ఐగుప్తులోనుండి రప్పించిన నాటనుండి నా నామము దానియందుండు నట్లుగా ఇశ్రాయేలీయుల గోత్రస్థానములలో ఏ పట్టణములోనైనను మందిరమును కట్టించుటకు నేను కోరలేదుగాని ఇశ్రాయేలీయులగు నా జనులమీద దావీదును ఉంచుటకు నేను కోరియున్నాను అని ఆయన సెలవిచ్చెను. ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా నామఘనతకు ఒక మందిరమును కట్టించవలెనని నా తండ్రియైన దావీదునకు మనస్సు పుట్టగా యెహోవా నా తండ్రియైన దావీదుతో సెలవిచ్చినదేమనగా–నా నామఘనతకు ఒక మందిరముకట్టించుటకు నీవు తాత్పర్యము కలిగి యున్నావు, ఆ తాత్పర్యము మంచిదే; అయినను నీవు మందిరమును కట్టించకూడదు; నీ నడుములోనుండి పుట్టబోవు నీ కుమారుడు నా నామఘనతకు ఒక మందిరమును కట్టించును. తాను సెలవిచ్చిన మాటను యెహోవా నెరవేర్చియున్నాడు. నేను నా తండ్రియైన దావీదునకు ప్రతిగా నియమింపబడి, యెహోవా సెలవుచొప్పున ఇశ్రాయేలీయులమీద సింహాసనాసీనుడనైయుండి, ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా నామఘనతకు మందిరమును కట్టించియున్నాను. అందులో యెహోవా నిబంధనమందసమునకు స్థలమును ఏర్పరచితిని, ఐగుప్తుదేశములోనుండి ఆయన మన పితరులను రప్పించినప్పుడు ఆయన చేసిన నిబంధన అందులోనే యున్నది.
చదువండి 1 రాజులు 8
వినండి 1 రాజులు 8
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: 1 రాజులు 8:1-21
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు