1 దినవృత్తాంతములు 1:1-27

1 దినవృత్తాంతములు 1:1-27 TELUBSI

ఆదాము షేతు ఎనోషు కేయినాను మహలలేలు యెరెదు హనోకు మెతూషెల లెమెకు నోవహు షేము హాము యాపెతు. యాపెతు కుమారులు; గోమెరు మాగోగు మాదయి యావాను తుబాలు మెషెకు తీరసు అనువారు. గోమెరు కుమారులు అష్కనజు రీఫతు తోగర్మా. యావాను కుమారులు ఏలీషా తర్షీషు కిత్తీము దోదా నీము. హాము కుమారులు; కూషు మిస్రాయిము పూతు కనాను. కూషు కుమారులు సెబా హవీలా సబ్తా రాయమా సబ్తకా. రాయమా కుమారులు షేబ దదాను. కూషు నిమ్రోదును కనెను, ఇతడు భూమిమీది పరాక్రమశాలులలో మొదటివాడు. లూదీయులు అనామీయులు లెహాబీయులు నప్తుహీయులు పత్రుసీయులు ఫిలిష్తీయుల వంశకర్తలైన కస్లూహీయులు కఫ్తోరీయులు మిస్రాయిము సంతతివారు. కనాను తన జ్యేష్ఠకుమారుడైన సీదోనును హేతును కనెను. యెబూసీయులు అమోరీయులు గిర్గాషీయులు హివ్వీయులు అర్కీయులు సీనీయులు అర్వాదీయులు సెమారీయులు హమాతీయులు అతని సంతతివారు. షేము కుమారులు; ఏలాము అష్షూరు అర్పక్షదు లూదు అరాము ఊజు హూలు గెతెరు మెషెకు. అర్పక్షదు షేలహును కనెను. షేలహు ఏబెరును కనెను. ఏబెరునకు ఇద్దరు కుమారులు పుట్టిరి, ఒకని దినములలో భూమి విభాగింపబడెను గనుక అతనికి పెలెగు అని పేరు పెట్టబడెను, అతని సహోదరుని పేరు యొక్తాను. యొక్తాను అల్మోదాదును షెలపును హసర్మావెతును యెరహును హదోరమును ఊజాలును దిక్లాను ఏబాలును అబీమా యేలును షేబను ఓఫీరును హవీలాను యోబాబును కనెను, వీరందరును యొక్తాను కుమారులు. షేము అర్పక్షదు షేలహు ఏబెరు పెలెగు రయూ సెరూగు నాహోరు తెరహు అబ్రాహామను పేరు పెట్టబడిన అబ్రాము. అబ్రాహాము కుమారులు, ఇస్సాకు ఇష్మాయేలు.