1
నిర్గమ 20:2-3
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
IRVTel
నేను యెహోవాను, మీ దేవుణ్ణి. ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న మిమ్మల్ని బయటకు తీసుకు వచ్చిన దేవుణ్ణి నేనే. నేను కాక వేరే దేవుడు మీకు ఉండకూడదు.
సరిపోల్చండి
నిర్గమ 20:2-3 ని అన్వేషించండి
2
నిర్గమ 20:4-5
పైన ఆకాశంలో గానీ, కింద భూమి మీద గానీ, భూమి కింద ఉండే నీళ్లలో గానీ ఎలాంటి ఆకారాన్నీ, ప్రతిమను తయారు చేసుకోకూడదు, వాటి ముందు సాష్టాంగపడ కూడదు, వాటిని పూజించ కూడదు. ఎందుకంటే నీ దేవుడనైన నేను రోషం గలవాణ్ణి. నన్ను లక్ష్యపెట్టని వారి విషయంలో వాళ్ళ మూడు నాలుగు తరాల దాకా వాళ్ళ పూర్వికుల దుష్టత్వం వారి సంతతి పైకి రప్పిస్తాను.
నిర్గమ 20:4-5 ని అన్వేషించండి
3
నిర్గమ 20:12
నీ దేవుడైన యెహోవా మీకివ్వబోయే దేశంలో నువ్వు దీర్ఘకాలం జీవించేలా నీ తండ్రిని, తల్లిని గౌరవించాలి.
నిర్గమ 20:12 ని అన్వేషించండి
4
నిర్గమ 20:8
విశ్రాంతి దినాన్ని పవిత్రంగా ఆచరించాలని జ్ఞాపకం ఉంచుకోవాలి.
నిర్గమ 20:8 ని అన్వేషించండి
5
నిర్గమ 20:7
నీ దేవుడైన యెహోవా నామాన్ని వ్యర్థంగా పలకకూడదు. తన నామాన్ని వ్యర్థంగా పలికే వాణ్ణి యెహోవా దోషిగా పరిగణిస్తాడు.
నిర్గమ 20:7 ని అన్వేషించండి
6
నిర్గమ 20:9-10
నువ్వు కష్టపడి ఆరు రోజుల్లో నీ పని అంతా ముగించాలి. ఏడవ రోజు నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం. ఆ రోజున నువ్వు, నీ కొడుకు, కూతురు, సేవకుడు, దాసీ, నీ ఇంట్లో ఉన్న విదేశీయుడు, నీ పశువులు ఎవ్వరూ ఏ పనీ చెయ్యకూడదు.
నిర్గమ 20:9-10 ని అన్వేషించండి
7
నిర్గమ 20:17
నీ పొరుగువాడి ఇల్లు గానీ, అతని భార్యను గానీ, దాస దాసీలను గానీ, అతని ఎద్దును గానీ, గాడిదను గానీ, నీ పొరుగు వాడికి చెందిన దేనినీ ఆశించకూడదు.
నిర్గమ 20:17 ని అన్వేషించండి
8
నిర్గమ 20:16
నీ పొరుగువాడిపై తప్పుడు సాక్ష్యం చెప్పకూడదు.
నిర్గమ 20:16 ని అన్వేషించండి
9
నిర్గమ 20:14
వ్యభిచారం చెయ్యకూడదు.
నిర్గమ 20:14 ని అన్వేషించండి
10
నిర్గమ 20:13
హత్య చెయ్యకూడదు.
నిర్గమ 20:13 ని అన్వేషించండి
11
నిర్గమ 20:15
దొంగతనం చెయ్యకూడదు.
నిర్గమ 20:15 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు