ప్రణాళిక సమాచారం

రూపాంతర పరచుటకై రూపాంతరం నొందుటనమూనా

రూపాంతర పరచుటకై రూపాంతరం నొందుట

DAY 2 OF 3

దేవునిఅత్మతో కలిసి వుండడం ద్వారానైన వాక్య బోధన ప్రకటన      


క్రీస్తు సాక్ష్యము మీలో స్థిరపచబడినందు వలన నా దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నాను  [వచనం 4–6 ASV] 


ఈ వచనాలలో మనం చూసినపుడు పౌలు వ్యక్తిగత మార్పుతో అతని ఉద్యమం ముగిసిపోలేదు. ఇతరులను ఆత్మీయంగా బలపరచడం, వారిని దేవునిలో నిలువబెట్టడం అనే పనుల్లో అతడు కొనసాగుతూ వచ్చాడు. తన కృపను దేవుడు అతనిపై వుంచడం ద్వారా తాను దేవునికి ఋణస్థుడనని తెలియ జేశాడు. దేవుని రక్షణ జ్ఞానం మనలో నూతన మార్పును సృష్టిస్తుందని, మనలను ఆంతర్యంలో ప్రేరేపించి మన హృదయాన్నిబలపరుస్తుందని పౌలు ద్వారా మనం తెలుసుకొంటూ వున్నాం.  


విశ్వాస విత్తనాలు చల్లి మిగిలిన పని దేవునికి అప్పగిద్దాం.


ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయాలను వివేచింపజాలడు


మనం సువార్తను స్వీకరించినపుడు సదరు స్పందన [ఫలితాలు] పర్యవసానం దేవుని శక్తి పరిధిలోనివి యుంటాయి. సిలువ వార్త దుష్కార్యాలు చేసేవారికి వెర్రితనంగా వుంటుంది. కానీ సిలువ రక్షింపబడే వారికి  శక్తికి మూలమైయుంది. కాబట్టి సిలువ సువార్తను ప్రకటించే మనం ఫలితాల విషయాన్ని దేవునికే విడిచిపెట్టడం మంచిది. దేవుడు తన సంకల్పాలను తాను ఏర్పరచుకొన్న వారికి తెలియజేస్తాడు. మనలో పనిచేసే దేవుని ఆత్మ ద్వారా మనం ఆయన ఉద్దేశ్యాన్ని తెలుసుకోగలం. దేవుని వాక్యం, దేవుని సత్యాన్ని మనకు బయలుపరుస్తుంది. దేవుని ఆత్మ లేకుండా ఏసుక్రీస్తును ప్రభువని ఎవరూ చెప్పజాలరు వివేచనా వరం అనేది దేవుని ఆత్మ ద్వారా కలుగుతుంది. ఇదే క్రమం మనకు దేవుని మనస్సును బయలుపరుస్తుంది        


నీవు చెప్పేది అనుసరించు. [మాట్లాడేది నడువు] 


దేవుని వాక్యాన్ని స్వీకరించి ప్రకటించుట అనేది మనలను దేవుని కొరకు జీవింపజేస్తుంది, దేవుని వాక్యం ద్వారా ఆభివృద్ధి చెంది పరిశుద్ధ జీవితం జీవించినపుడు మనం దేవుని ఆలయమై యున్నామనే గ్రహింపు కలుగుతుంది. కలహాలు, అసూయా ద్వేషాలు, ఇతర విగ్రహాలన్నిటినీ మనం మన జీవితాలలో నుండి తీసివెయ్యాలి. దైవ సేవకులమైన మనం దేవునికి సాక్ష్యార్ధమై జీవించడం ద్వారా ప్రజలను మనం దేవుని రాజ్యంలోనికి నడిపించాలి. ఆత్మల సంపాదనలో మనం విశ్వాస విత్తనాలు చల్లడం నీరు పెట్టడమనే మన   బాధ్యతను నెరవేర్చి మిగిలిన పనిని [ఫలితాల నెరవేర్పు]దేవునికి అప్పగించాలి. దేవుని రాజ్యంలో  విస్తరించే  సువార్త పని బృంద పరిచర్యయై వుంది. ప్రతి పని యొక్క ఫలితాన్ని దేవుడే బయలుపరచి కనబరచాలి. పరీక్షించబడిన ప్రతి పని బహుమతి పొందుతుంది. గనుక మనం పరీక్షించబడి, పరిశోధించబడినపుడు కలవరపడక ఓర్పు వహించినట్టయితే ఆశీర్వదించబడగలమనే విషయాన్ని మనస్సులో వుంచుకోవాలి.                   

Day 1Day 3

About this Plan

రూపాంతర పరచుటకై రూపాంతరం నొందుట

దేవుని పిలుపును పొంది ఆయన సంకల్పాలను అర్ధం చేస్కోవడం, సాక్ష్య జీవితాన్ని జీవించటం, రక్షణా ర్ధమైన దేవుని కృపను గూర్చి ఇతరులకు తెలియజేయడం, రానై యున్న నిరీక్షణతో ప్రస్తుత కాలములు లేక పరిస్థితులను దాటి వెళ్ళడం, దేవునిచే ఏర్ప...

More

ഈ പദ്ധതി നൽകിയതിന് സി ജെബരാജിന് നന്ദി പറയാൻ ഞങ്ങൾ ആഗ്രഹിക്കുന്നു. കൂടുതൽ വിവരങ്ങൾക്ക്, സന്ദർശിക്കുക: http://jebaraj1.blogspot.com/

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy