ప్రణాళిక సమాచారం

ఉప్పదనం, ప్రకాశవంతం – ధన్యతల అధ్యయనంనమూనా

ఉప్పదనం, ప్రకాశవంతం – ధన్యతల అధ్యయనం

DAY 8 OF 10

సమాధాన పరచువారు ధన్యులు 

సమాధాన పరచువారు అరుదైన వంశం. కలహాలు, విభజనల మధ్య సమాధానాన్ని నెలకొల్పడానికీ, సమాధానాన్ని కొనసాగించడానికీ ప్రయత్నిస్తున్న వారు. నిశ్శబ్దంగా ఉండటం, మన చుట్టూ ఉన్న సమస్యలలో చిక్కుకొనకుండా ఉండడం కొన్నిసార్లు సులభం. నా ఉద్దేశ్యం ఏమిటంటే ఇతరుల సమస్యలలో ఎందుకు జోక్యం చేసుకోవాలి? సమాధానపరచువారు దేవుని పిల్లలు అని పిలువబడతారని ప్రభువైన యేసు చెపుతున్నాడు. ఇది సరైనదే యెందుకంటే దేవుడు మనుష్యులను తనతో సమాధానపరచుకోడానికి ప్రభువైన యేసును ఈ లికానికి పంపాడు. ఆయన అత్యంత ఘనుడైన సమాధాన కర్త, ఆయన బిడ్డలంగా అదే విధంగా చెయ్యడం మన హృదయాలలో శాశ్వత అంశంగా ఉండాలి. పౌలు చెప్పిన విధంగా దేవుడు మనకు సమాధాన పరచు పరిచర్యను అనుగ్రహించాడు. అంటే మనుష్యులను దేవునితో సమాధానపరచడానికి మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. మనం ప్రవేశించే ప్రదేశాలలోనూ, మనం ఆక్రమించుకొనే స్థలాలలోనూ సమాధానాన్ని నెలకొల్పడం మనకున్న మరొక కర్తవ్యం. సంబంధాలలో సమాధానాన్ని కొనసాగించడానికి మన ప్రాధాన్యతగా ఉండాలి, తద్వారా ఈ ప్రక్రియలో దేవుడు తెలియపరచబడాలి, మహిమపరచబడాలి.

దేవుని బిడ్డగా మీ ఆధ్యాత్మిక డి.ఎం.ఎ సమాధానపరచేవానిగా ఉండాలి. ఆ శక్తివంతమైన ఉద్దేశ పరిధిలో నీవు నడుస్తున్నావా? 

Day 7Day 9

About this Plan

ఉప్పదనం, ప్రకాశవంతం – ధన్యతల అధ్యయనం

క్రైస్తవ ప్రయాణం దాని పర్వత శిఖర దృశ్యాలు, లోతైన లోయ ఋతువుల విభిన్న అనుభవాలతో నిండి ఉంది. జీవితంలో మనం ఉన్న జీవిత కాలంతో సంబంధం లేకుండా, మన చుట్టూ ఉన్నవారిపై మనం ఒక గుర్తును చూపాలి, తద్వారా వారు యేసును కలిగియుంటారు, లేదా...

More

ఈ ప్రణాళికను అందించినందుకు మేము ఆర్ జియాన్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: http://www.wearezion.in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy