నీవలన బలము నొందు మనుష్యులు ధన్యులు
యాత్రచేయు మార్గములు వారికి అతి ప్రియములు.
వారు బాకా లోయలోబడి వెళ్లుచు
దానిని జలమయముగా చేయుదురు
తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును.
వారు నానాటికి బలాభివృద్ధినొందుచు ప్రయాణము
చేయుదురు
వారిలో ప్రతివాడును సీయోనులో దేవుని సన్నిధిని
కనబడును.