Psalm 37:3-19

కీర్తనలు 37:3-19 - యెహోవాయందు నమ్మికయుంచి మేలుచేయుము
దేశమందు నివసించి సత్యము ననుసరించుము
యెహోవానుబట్టి సంతోషించుము
ఆయన నీ హృదయవాంఛలను తీర్చును.
నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము
నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము
నెరవేర్చును.
ఆయన వెలుగునువలె నీ నీతిని
మధ్యాహ్నమునువలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును.
యెహోవా యెదుట మౌనముగానుండి ఆయనకొరకు
కనిపెట్టుకొనుము.
తన మార్గమున వర్ధిల్లువాని చూచి వ్యసనపడకుము
దురాలోచనలు నెరవేర్చుకొనువాని చూచి వ్యసన
పడకుము.
కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము
వ్యసనపడకుము అది కీడుకే కారణము
కీడుచేయువారు నిర్మూలమగుదురు
యెహోవాకొరకు కనిపెట్టుకొనువారు దేశమును
స్వతంత్రించుకొందురు.
ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురువారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు
కనబడకపోవుదురు.
దీనులు భూమిని స్వతంత్రించుకొందురు
బహు క్షేమము కలిగి సుఖించెదరు
భక్తిహీనులు నీతిమంతులమీద దురాలోచన చేయుదురువారినిచూచి పండ్లు కొరుకుదురు.
వారి కాలమువచ్చుచుండుట ప్రభువు చూచు
చున్నాడు.వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు.
దీనులను దరిద్రులను పడద్రోయుటకై
యథార్థముగా ప్రవర్తించువారిని చంపుటకై
భక్తిహీనులు కత్తి దూసియున్నారు విల్లెక్కు పెట్టియున్నారు
వారి కత్తి వారి హృదయములోనే దూరునువారి విండ్లు విరువబడును.
నీతిమంతునికి కలిగినది కొంచెమైనను
బహుమంది భక్తిహీనులకున్న ధనసమృద్ధికంటె శ్రేష్ఠము.
భక్తిహీనుల బాహువులు విరువబడును
నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు
నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడువారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును.
ఆపత్కాలమందువారు సిగ్గునొందరు
కరవు దినములలో వారు తృప్తిపొందుదురు.

యెహోవాయందు నమ్మికయుంచి మేలుచేయుము దేశమందు నివసించి సత్యము ననుసరించుము యెహోవానుబట్టి సంతోషించుము ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయన వెలుగునువలె నీ నీతిని మధ్యాహ్నమునువలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. యెహోవా యెదుట మౌనముగానుండి ఆయనకొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్ధిల్లువాని చూచి వ్యసనపడకుము దురాలోచనలు నెరవేర్చుకొనువాని చూచి వ్యసన పడకుము. కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసనపడకుము అది కీడుకే కారణము కీడుచేయువారు నిర్మూలమగుదురు యెహోవాకొరకు కనిపెట్టుకొనువారు దేశమును స్వతంత్రించుకొందురు. ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురువారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోవుదురు. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు బహు క్షేమము కలిగి సుఖించెదరు భక్తిహీనులు నీతిమంతులమీద దురాలోచన చేయుదురువారినిచూచి పండ్లు కొరుకుదురు. వారి కాలమువచ్చుచుండుట ప్రభువు చూచు చున్నాడు.వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. దీనులను దరిద్రులను పడద్రోయుటకై యథార్థముగా ప్రవర్తించువారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసియున్నారు విల్లెక్కు పెట్టియున్నారు వారి కత్తి వారి హృదయములోనే దూరునువారి విండ్లు విరువబడును. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధనసమృద్ధికంటె శ్రేష్ఠము. భక్తిహీనుల బాహువులు విరువబడును నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడువారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును. ఆపత్కాలమందువారు సిగ్గునొందరు కరవు దినములలో వారు తృప్తిపొందుదురు.

కీర్తనలు 37:3-19

Psalm 37:3-19