Psalms 33:18-22

వారి ప్రాణమును మరణమునుండి తప్పించుటకును కరవులో వారిని సజీవులనుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయనయందు భయభక్తులుగలవారిమీదను ఆయన కృపకొరకు కనిపెట్టువారిమీదను నిలుచుచున్నది. మనము యెహోవా పరిశుద్ధనామమందు నమ్మిక యుంచియున్నాము. ఆయననుబట్టి మన హృదయము సంతోషించుచున్నది మన ప్రాణము యెహోవాకొరకు కనిపెట్టుకొనుచున్నది ఆయనే మనకు సహాయమును మనకు కేడెమునై యున్నాడు. యెహోవా, మేము నీకొరకు కనిపెట్టుచున్నాము నీ కృప మామీదనుండును గాక.
కీర్తనలు 33:18-22