Psalms 30:5-10

ఆయన కోపము నిమిషమాత్రముండును ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి, రాత్రి యుండినను ఉదయమున సంతోషము కలుగును. –నేనెన్నడు కదలనని నా క్షేమకాలమున అను కొంటిని. యెహోవా, దయకలిగి నీవే నా పర్వతమును స్థిర పరచితివి నీ ముఖమును నీవు దాచుకొనినప్పుడు నేను కలత జెందితిని యెహోవా, నీకే మొఱ్ఱపెట్టితిని నా ప్రభువును బతిమాలుకొంటిని. –నేను గోతిలోనికి దిగినయెడల నా ప్రాణమువలన ఏమి లాభము? మన్ను నిన్ను స్తుతించునా? నీ సత్యమునుగూర్చి అది వివరించునా? యెహోవా, ఆలకింపుము నన్ను కరుణింపుము యెహోవా, నాకు సహాయుడవై యుండుము
కీర్తనలు 30:5-10