Psalms 3:1-8

కీర్తనలు 3:1-8 - యెహోవా, నన్ను బాధించువారు ఎంతో విస్తరించియున్నారు
నామీదికి లేచువారు అనేకులు.
–దేవుని వలన అతనికి రక్షణ యేమియు దొరకదని
నన్నుగూర్చి చెప్పువారు అనేకులు (సెలా.)
యెహోవా, నీవే నాకు కేడెముగాను
నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు.
ఎలుగెత్తి నేను యెహోవాకు మొఱ్ఱపెట్టునప్పుడు
ఆయన తన పరిశుద్ధపర్వతమునుండి నాకు ఉత్తరమిచ్చును.
యెహోవా నాకు ఆధారము,
కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును
పదివేలమంది దండెత్తి నా మీదికి వచ్చి మోహ
రించినను నేను భయపడను
యెహోవా, లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము
నా శత్రువులనందరిని దవడ యెముకమీద కొట్టు
వాడవు నీవే, దుష్టుల పళ్లు విరుగగొట్టువాడవు నీవే.
రక్షణ యెహోవాది
నీ ప్రజలమీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. (సెలా.)

యెహోవా, నన్ను బాధించువారు ఎంతో విస్తరించియున్నారు నామీదికి లేచువారు అనేకులు. –దేవుని వలన అతనికి రక్షణ యేమియు దొరకదని నన్నుగూర్చి చెప్పువారు అనేకులు (సెలా.) యెహోవా, నీవే నాకు కేడెముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొఱ్ఱపెట్టునప్పుడు ఆయన తన పరిశుద్ధపర్వతమునుండి నాకు ఉత్తరమిచ్చును. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును పదివేలమంది దండెత్తి నా మీదికి వచ్చి మోహ రించినను నేను భయపడను యెహోవా, లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము నా శత్రువులనందరిని దవడ యెముకమీద కొట్టు వాడవు నీవే, దుష్టుల పళ్లు విరుగగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది నీ ప్రజలమీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. (సెలా.)

కీర్తనలు 3:1-8

Psalms 3:1-8