Psalm 27:4-9

యెహోవాయొద్ద ఒక్క వరము అడిగితిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆల యములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవామందిర ములో నివసింప గోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాటున నన్ను దాచును ఆశ్రయదుర్గముమీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొనియున్న నా శత్రువుల కంటె ఎత్తుగా నా తలయెత్తబడును. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించెదను. నేను పాడెదను, యెహోవానుగూర్చి స్తుతిగానము చేసెదను. యెహోవా, నేను కంఠధ్వని యెత్తి నిన్ను ప్రార్థించునప్పుడు నా మనవి ఆలకింపుము కరుణతో నాకుత్తరమిమ్ము. నా సన్నిధి వెదకుడని నీవు సెలవియ్యగా –యెహోవా, నీ సన్నిధి నేను వెదకెదనని నా హృదయము నీతో అనెను. నీ ముఖమును నాకు దాచకుము కోపముచేత నీ సేవకుని తోలివేయకుము. నా సహాయుడవు నీవే రక్షణకర్తవగు నా దేవా, నన్ను దిగనాడకుము నన్ను విడువకుము
కీర్తనలు 27:4-9