Psalms 139:13-16

కీర్తనలు 139:13-16 - నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి
నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినవాడవు నీవే.
నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును
ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి
అందునుబట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు
చున్నాను
నీ కార్యములు ఆశ్చర్యకరములు.
ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నది.
నేను రహస్యమందు పుట్టిననాడు
భూమియొక్క అగాధస్థలములలో విచిత్రముగా
నిర్మింపబడిననాడు
నాకు కలిగినయెముకలును నీకు మరుగై యుండలేదు
నేను పిండమునై యుండగా నీ కన్నులు నన్ను
చూచెను
నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే
నా దినములన్నియు నీ గ్రంథములో లిఖితము
లాయెను.
Psalms 139:13-16