Psalms 126:1-6

సీయోనుకు తిరిగి వచ్చినవారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకనినవారివలె నుంటిమి మన నోటి నిండ నవ్వుండెను మన నాలుక ఆనందగానముతో నిండియుండెను. అప్పుడు–యెహోవా వీరికొరకు గొప్పకార్యములు చేసెనని అన్యజనులు చెప్పుకొనిరి. యెహోవా మనకొరకు గొప్పకార్యములు చేసి యున్నాడు మనము సంతోషభరితులమైతిమి. దక్షిణదేశములో ప్రవాహములు పారునట్లుగా యెహోవా, చెరపట్టబడిన మా వారిని రప్పించుము. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేతపట్టుకొని యేడ్చుచుపోవు విత్తువాడు సంతోషగానముచేయుచు పనలు మోసికొనివచ్చును.
కీర్తనలు 126:1-6