Psalms 119:9-16

కీర్తనలు 119:9-16 - యౌవనస్థులు దేనిచేత తమ నడత శుద్దిపరచు కొందురు?
నీ వాక్యమునుబట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట
చేతనే గదా?
నా పూర్ణహృదయముతో నిన్ను వెదకియున్నాను
నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరుగనియ్యకుము.
నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు
నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని
యున్నాను.
యెహోవా, నీవే స్తోత్రము నొందదగినవాడవు
నీ కట్టడలను నాకు బోధించుము.
నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయవిధులన్నిటిని
నా పెదవులతో వివరించుదును.
సర్వసంపదలు దొరికినట్లు
నీ శాసనముల మార్గమునుబట్టి నేను సంతోషించు
చున్నాను.
నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను
నీ త్రోవలను మన్నించెదను.
నీ కట్టడలనుబట్టి నేను హర్షించెదను.
నీ వాక్యమును నేను మరువకయుందును.

యౌవనస్థులు దేనిచేత తమ నడత శుద్దిపరచు కొందురు? నీ వాక్యమునుబట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా? నా పూర్ణహృదయముతో నిన్ను వెదకియున్నాను నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరుగనియ్యకుము. నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని యున్నాను. యెహోవా, నీవే స్తోత్రము నొందదగినవాడవు నీ కట్టడలను నాకు బోధించుము. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయవిధులన్నిటిని నా పెదవులతో వివరించుదును. సర్వసంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమునుబట్టి నేను సంతోషించు చున్నాను. నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను నీ త్రోవలను మన్నించెదను. నీ కట్టడలనుబట్టి నేను హర్షించెదను. నీ వాక్యమును నేను మరువకయుందును.

కీర్తనలు 119:9-16

Psalms 119:9-16