Psalms 119:105-112

కీర్తనలు 119:105-112 - నీ వాక్యము నా పాదములకు దీపమును
నా త్రోవకు వెలుగునై యున్నది.
నీ న్యాయవిధులను నేననుసరించెదనని
నేను ప్రమాణము చేసియున్నాను నా మాట నెర
వేర్చుదును.
యెహోవా, నేను మిక్కిలి శ్రమపడుచున్నాను
నీ మాటచొప్పున నన్ను బ్రదికింపుము.
యెహోవా, నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీక
రించుము.
నీ న్యాయవిధులను నాకు బోధింపుము
నా ప్రాణము ఎల్లప్పుడు నా అరచేతిలో ఉన్నది.
అయినను నీ ధర్మశాస్త్రమును నేను మరువను.
నన్ను పట్టుకొనుటకై భక్తిహీనులు ఉరియొడ్డిరి
అయినను నీ ఉపదేశములనుండి నేను తొలగి తిరుగుటలేదు.
నీ శాసనములు నాకు హృదయానందకరములు
అవి నాకు నిత్యస్వాస్థ్యమని భావించుచున్నాను.
నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను
లోపరచుకొనియున్నాను
ఇది తుదవరకు నిలుచు నిత్యనిర్ణయము.

నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది. నీ న్యాయవిధులను నేననుసరించెదనని నేను ప్రమాణము చేసియున్నాను నా మాట నెర వేర్చుదును. యెహోవా, నేను మిక్కిలి శ్రమపడుచున్నాను నీ మాటచొప్పున నన్ను బ్రదికింపుము. యెహోవా, నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీక రించుము. నీ న్యాయవిధులను నాకు బోధింపుము నా ప్రాణము ఎల్లప్పుడు నా అరచేతిలో ఉన్నది. అయినను నీ ధర్మశాస్త్రమును నేను మరువను. నన్ను పట్టుకొనుటకై భక్తిహీనులు ఉరియొడ్డిరి అయినను నీ ఉపదేశములనుండి నేను తొలగి తిరుగుటలేదు. నీ శాసనములు నాకు హృదయానందకరములు అవి నాకు నిత్యస్వాస్థ్యమని భావించుచున్నాను. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరచుకొనియున్నాను ఇది తుదవరకు నిలుచు నిత్యనిర్ణయము.

కీర్తనలు 119:105-112

Psalms 119:105-112