Psalm 119:1-8

కీర్తనలు 119:1-8 - యెహోవా ధర్మశాస్త్రము ననుసరించి
నిర్దోషముగా నడుచుకొనువారు ధన్యులు
ఆయన శాసనములను గైకొనుచు
పూర్ణహృదయముతో ఆయనను వెదకువారు ధన్యులు.
వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ
పాపమును చేయరు
నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని
నీవు మాకు ఆజ్ఞాపించియున్నావు.
ఆహా నీ కట్టడలను గైకొనునట్లు
నా ప్రవర్తన స్థిరపడియుండిన నెంత మేలు.
నీ ఆజ్ఞలన్నిటిని నేను లక్ష్యము చేయునప్పుడు
నాకు అవమానము కలుగనేరదు.
నీతిగల నీ న్యాయవిధులను నేను నేర్చుకొనునప్పుడు
యథార్థహృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను.
నీ కట్టడలను నేను గైకొందును
నన్ను బొత్తిగా విడనాడకుము.
Psalm 119:1-8