Psalms 104:24-30

కీర్తనలు 104:24-30 - యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా
నున్నవి !
జ్ఞానముచేత నీవు వాటన్నిటిని నిర్మించితివి
నీవు కలుగజేసినవాటితో భూమి నిండియున్నది.
అదిగో విశాలమైన మహాసముద్రము
అందులో లెక్కలేని జలచరములు
దానిలో చిన్నవి పెద్దవి జీవరాసులున్నవి.
అందులో ఓడలు నడుచుచున్నవి
దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరము
లున్నవి.
తగిన కాలమున నీవు వాటికి ఆహారమిచ్చెదవని
ఇవన్నియు నీ దయకొరకు కనిపెట్టుచున్నవి
నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకొనును
నీవు గుప్పిలి విప్పగా అవి మంచివాటిని తిని తృప్తి
పరచబడును.
నీవు ముఖము మరుగుచేసికొనగా అవి కలతపడును
నీవు వాటి ఊపిరి తీసివేయునప్పుడు అవి ప్రాణములు
విడిచి మంటి పాలగును.
నీవు నీ ఊపిరి విడువగా అవి సృజింపబడును
అట్లు నీవు భూతలమును నూతనపరచుచున్నావు.

యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా నున్నవి ! జ్ఞానముచేత నీవు వాటన్నిటిని నిర్మించితివి నీవు కలుగజేసినవాటితో భూమి నిండియున్నది. అదిగో విశాలమైన మహాసముద్రము అందులో లెక్కలేని జలచరములు దానిలో చిన్నవి పెద్దవి జీవరాసులున్నవి. అందులో ఓడలు నడుచుచున్నవి దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరము లున్నవి. తగిన కాలమున నీవు వాటికి ఆహారమిచ్చెదవని ఇవన్నియు నీ దయకొరకు కనిపెట్టుచున్నవి నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకొనును నీవు గుప్పిలి విప్పగా అవి మంచివాటిని తిని తృప్తి పరచబడును. నీవు ముఖము మరుగుచేసికొనగా అవి కలతపడును నీవు వాటి ఊపిరి తీసివేయునప్పుడు అవి ప్రాణములు విడిచి మంటి పాలగును. నీవు నీ ఊపిరి విడువగా అవి సృజింపబడును అట్లు నీవు భూతలమును నూతనపరచుచున్నావు.

కీర్తనలు 104:24-30

Psalms 104:24-30