Proverbs 2:6-11

యెహోవాయే జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోటనుండి వచ్చును. ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును యుక్తమార్గము తప్పక నడుచుకొనువారికి ఆయన కేడెముగా నున్నాడు. న్యాయము తప్పిపోకుండ ఆయన కనిపెట్టును తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలిసికొందువు. జ్ఞానము నీ హృదయమున జొచ్చును తెలివి నీకు మనోహరముగానుండును బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కావలి కాయును.
సామెతలు 2:6-11