Matthew 5:3-11

మత్తయి 5:3-11 - ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది.
దుఃఖపడువారు ధన్యులు; వారు ఓదార్చబడుదురు.
సాత్వికులు ధన్యులు; వారు భూలోకమును స్వతం త్రించుకొందురు.
నీతికొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు; వారు తృప్తిపరచబడుదురు.
కనికరముగలవారు ధన్యులు; వారు కనికరము పొందుదురు.
హృదయశుద్ధిగలవారు ధన్యులు; వారు దేవుని చూచెదరు.
సమాధానపరచువారు ధన్యులు ; వారు దేవుని కుమారు లనబడుదురు.
నీతినిమిత్తము హింసింపబడువారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది.
నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు.
Matthew 5:3-11