Isaiah 9:6-9

యెషయా 9:6-9 - ఏలయనగా మనకు శిశువు పుట్టెను
మనకు కుమారుడు అనుగ్రహింపబడెను
ఆయన భుజముమీద రాజ్యభారముండును.
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు
నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని
అతనికి పేరు పెట్టబడును.
ఇది మొదలుకొని మితిలేకుండ దానికి వృద్ధియు క్షేమ
మును కలుగునట్లు
సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును
నియమించును
న్యాయమువలనను నీతివలనను రాజ్యమును స్థిరపరచు
టకు
అతడు సింహాసనాసీనుడై రాజ్యపరిపాలన చేయును.
సైన్యములకధిపతియగు యెహోవా ఆసక్తికలిగి దీనిని
నెరవేర్చును.
ప్రభువు యాకోబు విషయమై వర్తమానము పంపగా
అది ఇశ్రాయేలువరకు దిగివచ్చియున్నది.
అది ఎఫ్రాయిముకును షోమ్రోను నివాసులకును
ప్రజలకందరికి తెలియవలసియున్నది.

ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితిలేకుండ దానికి వృద్ధియు క్షేమ మును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయమువలనను నీతివలనను రాజ్యమును స్థిరపరచు టకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపరిపాలన చేయును. సైన్యములకధిపతియగు యెహోవా ఆసక్తికలిగి దీనిని నెరవేర్చును. ప్రభువు యాకోబు విషయమై వర్తమానము పంపగా అది ఇశ్రాయేలువరకు దిగివచ్చియున్నది. అది ఎఫ్రాయిముకును షోమ్రోను నివాసులకును ప్రజలకందరికి తెలియవలసియున్నది.

యెషయా 9:6-9

Isaiah 9:6-9