నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము, తేజరిల్లుము
యెహోవా మహిమ నీమీద ఉదయించెను.
చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది
కటికచీకటి జనములను కమ్ముచున్నది
యెహోవా నీమీద ఉదయించుచున్నాడు
ఆయన మహిమ నీమీద కనబడుచున్నది
జనములు నీ వెలుగునకు వచ్చెదరు
రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు.