Isaiah 11:1-9

యెషయా 11:1-9 - యెష్షయి మొద్దునుండి చిగురు పుట్టును
వాని వేరులనుండి అంకురము ఎదిగి ఫలించును
యెహోవా ఆత్మ జ్ఞానవివేకములకు ఆధారమగు ఆత్మ
ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ
తెలివిని యెహోవాయెడల భయభక్తులను పుట్టించు
ఆత్మ అతనిమీద నిలుచును
యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా
ఉండును.
కంటి చూపునుబట్టి అతడు తీర్పుతీర్చడు
తాను వినుదానినిబట్టి విమర్శచేయడు
నీతినిబట్టి బీదలకు తీర్పుతీర్చును
భూనివాసులలో దీనులైనవారికి యథార్థముగా విమర్శ
చేయును
తన వాగ్దండముచేత లోకమును కొట్టును
తన పెదవుల ఊపిరిచేత దుష్టులను చంపును
అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును
నడికట్టుగా ఉండును.
తోడేలు గొఱ్ఱెపిల్లయొద్ద వాసముచేయును
చిఱుతపులి మేకపిల్లయొద్ద పండుకొనును
దూడయు కొదమసింహమును పెంచబడిన కోడెయు
కూడుకొనగా
బాలుడు వాటిని తోలును.
ఆవులు ఎలుగులు కూడి మేయును
వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకొనును
ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును.
పాలుకుడుచుపిల్ల నాగుపాము పుట్టయొద్ద ఆటలాడును
మిడినాగు పుట్టమీద పాలువిడచిన పిల్ల తన చెయ్యిచాచును
నా పరిశుద్ధపర్వతమందంతటను ఏ మృగమును హాని
చేయదు నాశముచేయదు
సముద్రము జలముతో నిండియున్నట్టు
లోకము యెహోవానుగూర్చిన జ్ఞానముతో నిండియుండును.

యెష్షయి మొద్దునుండి చిగురు పుట్టును వాని వేరులనుండి అంకురము ఎదిగి ఫలించును యెహోవా ఆత్మ జ్ఞానవివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ తెలివిని యెహోవాయెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతనిమీద నిలుచును యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపునుబట్టి అతడు తీర్పుతీర్చడు తాను వినుదానినిబట్టి విమర్శచేయడు నీతినిబట్టి బీదలకు తీర్పుతీర్చును భూనివాసులలో దీనులైనవారికి యథార్థముగా విమర్శ చేయును తన వాగ్దండముచేత లోకమును కొట్టును తన పెదవుల ఊపిరిచేత దుష్టులను చంపును అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. తోడేలు గొఱ్ఱెపిల్లయొద్ద వాసముచేయును చిఱుతపులి మేకపిల్లయొద్ద పండుకొనును దూడయు కొదమసింహమును పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. ఆవులు ఎలుగులు కూడి మేయును వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకొనును ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును. పాలుకుడుచుపిల్ల నాగుపాము పుట్టయొద్ద ఆటలాడును మిడినాగు పుట్టమీద పాలువిడచిన పిల్ల తన చెయ్యిచాచును నా పరిశుద్ధపర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు నాశముచేయదు సముద్రము జలముతో నిండియున్నట్టు లోకము యెహోవానుగూర్చిన జ్ఞానముతో నిండియుండును.

యెషయా 11:1-9

Isaiah 11:1-9