1 Samuel 2:1-11

1 సమూయేలు 2:1-11 - మరియు హన్నా విజ్ఞాపనచేసి యీలాగనెను–
నా హృదయము యెహోవాయందు సంతోషించుచున్నది.
యెహోవాయందు నాకు మహా బలముకలిగెను
నీవలని రక్షణనుబట్టి సంతోషించుచున్నాను
నావిరోధులమీద నేను అతిశయపడుదును.
యెహోవావంటి పరిశుద్ధ దేవుడు ఒకడునులేడు
నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు
మన దేవునివంటి ఆశ్రయదుర్గమేదియులేదు.
యెహోవా అనంతజ్ఞానియగు దేవుడు
ఆయనే క్రియలను పరీక్షించువాడు
ఇకను అంత గర్వముగా మాటలాడకుడి
గర్వపుమాటలు మీ నోట రానియ్యకుడి.
ప్రఖ్యాతినొందిన విలుకాండ్రు ఓడిపోవుదురు
తొట్రిల్లినవారు బలము ధరించుకొందురు.
తృప్తిగా భుజించినవారు అన్నము కావలెనని కూలికి పోవుదురు
ఆకలిగొనినవారు ఆకలితీర తిందురు
గొడ్రాలు ఏడుగురు పిల్లలను కనును
అనేకమైన పిల్లలను కనినది కృశించి పోవును.
జనులను సజీవులనుగాను మృతులనుగాను చేయువాడు యెహోవాయే
పాతాళమునకు పంపుచు అందులోనుండి రప్పించుచుండువాడు ఆయనే.
యెహోవా దారిద్యమును ఐశ్వర్యమును కలుగజేయు వాడు
క్రుంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే.
దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును
మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును
వారిని మంటిలోనుండి యెత్తువాడు ఆయనే
లేమిగలవారిని పెంటకుప్పమీదినుండి లేవనెత్తువాడు ఆయనే.
భూమియొక్క స్తంభములు యెహోవా వశము,
లోకమును వాటిమీద ఆయన నిలిపియున్నాడు.
తన భక్తుల పాదములు తొట్రిల్లకుండ ఆయన వారిని కాపాడును
దుర్మార్గులు అంధకారమందు మాటుమణుగుదురు
బలముచేత ఎవడును జయము నొందడు.
యెహోవాతో వాదించువారు నాశనమగుదురు
పరమండలములోనుండి ఆయన వారిపైన ఉరుమువలె గర్జించును
లోకపు సరిహద్దులలో నుండువారికి ఆయన తీర్పు తీర్చును
తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును
తాను అభిషేకించినవానికి అధిక బలము కలుగజేయును.
తరువాత ఎల్కానా రామాలోని తన యింటికి వెళ్లి పోయెను; అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ యెదుట యెహోవాకు పరిచర్యచేయుచుండెను.

మరియు హన్నా విజ్ఞాపనచేసి యీలాగనెను– నా హృదయము యెహోవాయందు సంతోషించుచున్నది. యెహోవాయందు నాకు మహా బలముకలిగెను నీవలని రక్షణనుబట్టి సంతోషించుచున్నాను నావిరోధులమీద నేను అతిశయపడుదును. యెహోవావంటి పరిశుద్ధ దేవుడు ఒకడునులేడు నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు మన దేవునివంటి ఆశ్రయదుర్గమేదియులేదు. యెహోవా అనంతజ్ఞానియగు దేవుడు ఆయనే క్రియలను పరీక్షించువాడు ఇకను అంత గర్వముగా మాటలాడకుడి గర్వపుమాటలు మీ నోట రానియ్యకుడి. ప్రఖ్యాతినొందిన విలుకాండ్రు ఓడిపోవుదురు తొట్రిల్లినవారు బలము ధరించుకొందురు. తృప్తిగా భుజించినవారు అన్నము కావలెనని కూలికి పోవుదురు ఆకలిగొనినవారు ఆకలితీర తిందురు గొడ్రాలు ఏడుగురు పిల్లలను కనును అనేకమైన పిల్లలను కనినది కృశించి పోవును. జనులను సజీవులనుగాను మృతులనుగాను చేయువాడు యెహోవాయే పాతాళమునకు పంపుచు అందులోనుండి రప్పించుచుండువాడు ఆయనే. యెహోవా దారిద్యమును ఐశ్వర్యమును కలుగజేయు వాడు క్రుంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలోనుండి యెత్తువాడు ఆయనే లేమిగలవారిని పెంటకుప్పమీదినుండి లేవనెత్తువాడు ఆయనే. భూమియొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటిమీద ఆయన నిలిపియున్నాడు. తన భక్తుల పాదములు తొట్రిల్లకుండ ఆయన వారిని కాపాడును దుర్మార్గులు అంధకారమందు మాటుమణుగుదురు బలముచేత ఎవడును జయము నొందడు. యెహోవాతో వాదించువారు నాశనమగుదురు పరమండలములోనుండి ఆయన వారిపైన ఉరుమువలె గర్జించును లోకపు సరిహద్దులలో నుండువారికి ఆయన తీర్పు తీర్చును తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును తాను అభిషేకించినవానికి అధిక బలము కలుగజేయును. తరువాత ఎల్కానా రామాలోని తన యింటికి వెళ్లి పోయెను; అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ యెదుట యెహోవాకు పరిచర్యచేయుచుండెను.

1 సమూయేలు 2:1-11

1 Samuel 2:1-11