మరియు హన్నా విజ్ఞాపనచేసి యీలాగనెను–
నా హృదయము యెహోవాయందు సంతోషించుచున్నది.
యెహోవాయందు నాకు మహా బలముకలిగెను
నీవలని రక్షణనుబట్టి సంతోషించుచున్నాను
నావిరోధులమీద నేను అతిశయపడుదును.
యెహోవావంటి పరిశుద్ధ దేవుడు ఒకడునులేడు
నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు
మన దేవునివంటి ఆశ్రయదుర్గమేదియులేదు.