1 Peter 3:8-12

1 పేతురు 3:8-12 - తుదకు మీరందరు ఏకమనస్కులై యొకరి సుఖదుఃఖములయందు ఒకరు పాలుపడి, సహోదరప్రేమ గల వారును, కరుణాచిత్తులును, వినయమనస్కులునై యుండుడి. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతి దూషణయైనను చేయక దీవించుడి.
–జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు
వాడు చెడ్డదాని పలుకకుండ తన నాలుకను,
కపటపు మాటలు చెప్పకుండ తన పెదవులను
కాచుకొనవలెను.
అతడు కీడునుండి తొలగి
మేలుచేయవలెను, సమాధానమును వెదకి దాని
వెంటాడవలెను.
ప్రభువు కన్నులు నీతిమంతుల
మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను
ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడుచేయువారికి విరోధముగా ఉన్నది.

తుదకు మీరందరు ఏకమనస్కులై యొకరి సుఖదుఃఖములయందు ఒకరు పాలుపడి, సహోదరప్రేమ గల వారును, కరుణాచిత్తులును, వినయమనస్కులునై యుండుడి. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతి దూషణయైనను చేయక దీవించుడి. –జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదాని పలుకకుండ తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండ తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడునుండి తొలగి మేలుచేయవలెను, సమాధానమును వెదకి దాని వెంటాడవలెను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడుచేయువారికి విరోధముగా ఉన్నది.

1 పేతురు 3:8-12

1 Peter 3:8-12