1 Chronicles 16:23-31

1 దినవృత్తాంతములు 16:23-31 - సర్వభూజనులారా, యెహోవాను సన్నుతించుడి
అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి.
అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి
సమస్త జనములలో ఆయన ఆశ్చర్యకార్యములను
ప్రచురించుడి.
యెహోవా మహాఘనత వహించినవాడు
ఆయన బహుగా స్తుతినొంద తగినవాడు
సమస్త దేవతలకంటె ఆయన పూజ్యుడు.
జనముల దేవతలన్నియు వట్టి విగ్రహములే
యెహోవా ఆకాశవైశాల్యమును సృజించినవాడు.
ఘనతాప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి
బలమును సంతోషమును ఆయనయొద్ద ఉన్నవి.
జనముల కుటుంబములారా, యెహోవాకు చెల్లించుడి.
మహిమాబలమును యెహోవాకు చెల్లించుడి.
యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు
చెల్లించుడి
నైవేద్యములు చేతపుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి
పరిశుద్ధాలంకారములగు ఆభరణములను ధరించుకొని
ఆయనయెదుట సాగిలపడుడి.
భూజనులారా, ఆయన సన్నిధిని వణకుడి
అప్పుడు భూలోకము కదలకుండును
అప్పుడది స్థిరపరచబడును.
యెహోవా ఏలుచున్నాడని జనములలో చాటించుడి.
ఆకాశములు ఆనందించునుగాక
భూమి సంతోషించునుగాక

సర్వభూజనులారా, యెహోవాను సన్నుతించుడి అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి సమస్త జనములలో ఆయన ఆశ్చర్యకార్యములను ప్రచురించుడి. యెహోవా మహాఘనత వహించినవాడు ఆయన బహుగా స్తుతినొంద తగినవాడు సమస్త దేవతలకంటె ఆయన పూజ్యుడు. జనముల దేవతలన్నియు వట్టి విగ్రహములే యెహోవా ఆకాశవైశాల్యమును సృజించినవాడు. ఘనతాప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి బలమును సంతోషమును ఆయనయొద్ద ఉన్నవి. జనముల కుటుంబములారా, యెహోవాకు చెల్లించుడి. మహిమాబలమును యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి నైవేద్యములు చేతపుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి పరిశుద్ధాలంకారములగు ఆభరణములను ధరించుకొని ఆయనయెదుట సాగిలపడుడి. భూజనులారా, ఆయన సన్నిధిని వణకుడి అప్పుడు భూలోకము కదలకుండును అప్పుడది స్థిరపరచబడును. యెహోవా ఏలుచున్నాడని జనములలో చాటించుడి. ఆకాశములు ఆనందించునుగాక భూమి సంతోషించునుగాక

1 దినవృత్తాంతములు 16:23-31

1 Chronicles 16:23-31