కోసం శోధన ఫలితాలు: romans 6:23
రోమా 6:23 (TELUBSI)
ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్యజీవము.
ఎఫెసీయులకు 6:23 (TELUBSI)
తండ్రియైన దేవునినుండియు ప్రభువైన యేసు క్రీస్తు నుండియు సమాధానమును విశ్వాసముతోకూడిన ప్రేమయును సహోదరులకు కలుగును గాక.
నిర్గమకాండము 6:23 (TELUBSI)
అహరోను అమ్మీనాదాబు కుమార్తెయు నయస్సోను సహో దరియునైన ఎలీషెబను పెండ్లిచేసి కొనెను. ఆమె అతనికి నాదాబును అబీహును ఎలియాజరును ఈతామారును కనెను.
లేవీయకాండము 6:23 (TELUBSI)
యాజకుడుచేయు ప్రతి నైవేద్యము నిశ్శేషముగా కాల్చబడవలెను; దాని తినవలదు.
సంఖ్యాకాండము 6:23 (TELUBSI)
–మీరు ఇశ్రాయేలీయులను ఈలాగు దీవింపవలెను.
ద్వితీయోపదేశకాండము 6:23 (TELUBSI)
తాను మన పితరులతో ప్రమాణము చేసిన దేశమును మనకిచ్చి మనలను దానిలో ప్రవేశ పెట్టుటకు అక్కడనుండి మనలను రప్పించెను.
సామెతలు 6:23 (TELUBSI)
ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు.
మార్కు 6:23 (TELUBSI)
మరియు–నీవు నా రాజ్యములో సగముమట్టుకు ఏమి అడిగినను నీకిచ్చెదనని అతడు ఆమెతో ఒట్టుపెట్టుకొనెను
యోహాను 6:23 (TELUBSI)
అయితే ప్రభువు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటునకు దగ్గరనున్న తిబెరియనుండి వేరే చిన్న దోనెలు వచ్చెను.
యిర్మీయా 6:23 (TELUBSI)
వారు వింటిని ఈటెను వాడనేర్చినవారు, అది యొక క్రూర జనము; వారు జాలిలేనివారు, వారి స్వరము సముద్ర ఘోషవలె నున్నది, వారు గుఱ్ఱములెక్కి సవారిచేయు వారు; సీయోను కుమారీ, నీతో యుద్ధము చేయవలెనని వారు యోధులవలె వ్యూహము తీరియున్నారు.
దానియేలు 6:23 (TELUBSI)
రాజు ఇందునుగూర్చి యతి సంతోషభరితుడై దానియేలును గుహలోనుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవునియందు భక్తిగలవాడైనందున అతనికి ఏ హానియు కలుగ లేదు.
మత్తయి 6:23 (TELUBSI)
నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై యుండును; నీలోనున్న వెలుగు చీకటియైయుండినయెడల ఆ చీకటి యెంతో గొప్పది.
లూకా 6:23 (TELUBSI)
ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి; ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై యుండును; వారి పిత రులు ప్రవక్తలకు అదే విధముగా చేసిరి.
యెహోషువ 6:23 (TELUBSI)
వేగులవారైన ఆ మనుష్యులు పోయి రాహాబును ఆమె తండ్రిని ఆమె తల్లిని ఆమె సహోదరులను ఆమెకు కలిగినవారినందరిని వెలుపలికి తోడుకొని వచ్చిరి; ఆమె యింటివారినందరిని వారు వెలుపలికి తోడుకొని ఇశ్రాయేలీయుల పాళెమువెలుపట వారిని నివసింపజేసిరి.
న్యాయాధిపతులు 6:23 (TELUBSI)
అప్పుడు యెహోవా–నీకు సమాధానము, భయపడకుము, నీవు చావవని అతనితో సెలవిచ్చెను.
యోబు 6:23 (TELUBSI)
పగవానిచేతిలోనుండి నన్ను విడిపింపుడని యడిగితినా? బాధించువారి చేతిలోనుండి నన్ను విమోచింపుడని యడిగితినా?
1 రాజులు 6:23 (TELUBSI)
మరియు అతడు గర్భాలయమందు పదేసి మూరల యెత్తుగల రెండు కెరూబులను ఒలీవ కఱ్ఱతో చేయించెను;
2 రాజులు 6:23 (TELUBSI)
అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవుపొంది తమ యజమానుని యొద్దకు పోయిరి. అప్పటినుండి సిరియనులదండువారు ఇశ్రాయేలుదేశములోనికి వచ్చుట మానిపోయెను.
1 దినవృత్తాంతములు 6:23 (TELUBSI)
అస్సీరు కుమారుడు ఎల్కానా, ఎల్కానా కుమారుడు ఎబ్యాసాపు, ఎబ్యాసాపు కుమారుడు అస్సీరు,
2 దినవృత్తాంతములు 6:23 (TELUBSI)
నీవు ఆకాశమందు విని, నీ దాసులకు న్యాయముతీర్చి, హాని చేసినవాని తలమీదికి శిక్ష రప్పించి, నీతిపరుని నీతిచొప్పున వానికిచ్చి వాని నీతిని నిర్ధారణ చేయుము.
నిర్గమకాండము 23:6 (TELUBSI)
దరిద్రుని వ్యాజ్యెములో న్యాయము విడిచి తీర్పు తీర్చకూడదు
లేవీయకాండము 23:6 (TELUBSI)
ఆ నెల పదునయిదవదినమున యెహోవాకు పొంగనిరొట్టెల పండుగ జరుగును; ఏడు దినములు మీరు పొంగని వాటినే తినవలెను
సంఖ్యాకాండము 23:6 (TELUBSI)
అతడు బాలాకునొద్దకు తిరిగివెళ్లినప్పుడు అతడు మోయాబు అధికారులందరితో తన దహనబలి యొద్ద నిలిచియుండెను.
ద్వితీయోపదేశకాండము 23:6 (TELUBSI)
నీ దినములన్నిట ఎన్నడును వారి క్షేమమునైనను మేలునైనను విచారింపకూడదు.
సామెతలు 23:6 (TELUBSI)
ఎదుటివాని మేలు ఓర్చలేనివానితో కలిసి భోజనము చేయకుము వాని రుచిగల పదార్థముల నాశింపకుము.