కోసం శోధన ఫలితాలు: mark 12:31

నిర్గమకాండము 12:31 (TELUBSI)

ఆ రాత్రివేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో –మీరును ఇశ్రాయేలీయులును లేచి నా ప్రజలమధ్యనుండి బయలు వెళ్లుడి, మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి.

ద్వితీయోపదేశకాండము 12:31 (TELUBSI)

తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యెహోవానుగూర్చి చేయవలదు, ఏలయనగా యెహోవా ద్వేషించు ప్రతి హేయక్రియను వారు తమ దేవతలకు చేసిరి. వారు తమ దేవతలపేరట తమ కుమారులను తమ కుమార్తెలను అగ్నిహోత్రములో కాల్చివేయుదురు గదా.

నెహెమ్యా 12:31 (TELUBSI)

అటుతరువాత నేను యూదుల ప్రధానులను ప్రాకారముమీదికి తోడుకొని వచ్చి స్తోత్రగీతములు పాడువారిని రెండు గొప్ప సమూహములుగా ఏర్పరచితిని. అందులో ఒక సమూహము కుడిప్రక్కను పెంట గుమ్మము వైపున ప్రాకారముమీదను నడిచెను.

లూకా 12:31 (TELUBSI)

మీరైతే ఆయన రాజ్యమును వెదకుడి, దానితోకూడ ఇవి మీ కనుగ్రహింపబడును.

యోహాను 12:31 (TELUBSI)

ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది, ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును;

మత్తయి 12:31 (TELUBSI)

కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా–మనుష్యులుచేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు.

మార్కు 12:31 (TELUBSI)

రెండవది, నీవు నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెననునది రెండవ ఆజ్ఞ; వీటికంటె ముఖ్యమైన ఆజ్ఞ మరే దియు లేదని అతనితో చెప్పెను

1 కొరింథీయులకు 12:31 (TELUBSI)

కృపావరములలో శ్రేప్ఠమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను.

2 సమూయేలు 12:31 (TELUBSI)

పట్టణములో ఉన్నవారిని బయటికి తెప్పించి రంపములచేతను పదును గల యినుప పనిముట్లచేతను ఇనుప గొడ్డండ్లచేతను వారిని తుత్తునియలుగా చేయించి వారిని ఇటుక ఆవములో వేసెను. అమ్మోనీయుల పట్టణములన్నిటికి అతడు ఈలాగు చేసెను. ఆ తరువాత దావీదును జనులందరును తిరిగి యెరూషలేమునకు వచ్చిరి.

1 రాజులు 12:31 (TELUBSI)

మరియు అతడు ఉన్నతస్థలములను కట్టించి మందిరముగా ఏర్పరచి, లేవీయులు కాని సాధారణమైనవారిలో కొందరిని యాజకులుగా నియమించెను.

1 దినవృత్తాంతములు 12:31 (TELUBSI)

మనేష్షయొక్క అర్ధగోత్రపువారిలో దావీదును రాజుగా చేయుటకై రావలెనని పేరు పేరుగా నియమింపబడినవారు పదునెనిమిదివేలమంది.

ఆదికాండము 31:12 (TELUBSI)

అప్పుడు ఆయన–నీ కన్నులెత్తి చూడుము; గొఱ్ఱెలను దాటు చున్న పొట్టేళ్లన్నియు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి; ఏలయనగా లాబాను నీకు చేయుచున్నది యావత్తును చూచితిని

సంఖ్యాకాండము 31:12 (TELUBSI)

తరువాత వారు మోయాబు మైదానములలో యెరికో యొద్దనున్న యొర్దాను దగ్గర దిగియున్న దండులో మోషే యొద్దకును యాజకుడైన ఎలియాజరు నొద్దకును ఇశ్రాయేలీయుల సమాజము నొద్దకును చెరపట్టబడినవారిని అపహరణములను ఆ కొల్ల సొమ్మును తీసికొని రాగా

ద్వితీయోపదేశకాండము 31:12 (TELUBSI)

మీ దేవుడైన యెహోవాకు భయపడి యీ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకొనునట్లు పురుషులేమి స్త్రీలేమి పిల్లలేమి నీ పురములలోనున్న పరదేశులేమి వాటిని విని నేర్చుకొనుటకై అందరిని పోగుచేయవలెను.

యోబు 31:12 (TELUBSI)

అది నాశనకూపమువరకు దహించు అగ్నిహోత్రము అది నా ఆదాయమంతయు నిర్మూలము చేయును.

కీర్తనలు 31:12 (TELUBSI)

మరణమై స్మరణకు రాకున్న వానివలె మరువబడితిని ఓటికుండవంటి వాడనైతిని.

యెహెజ్కేలు 31:12 (TELUBSI)

జనములలో క్రూరులైన పరదేశులు అతనిని నరికి పారవేసిరి, కొండలలోను లోయలన్నిటిలోను అతని కొమ్మలు పడెను, భూమియందున్న వాగులలో అతని శాఖలు విరిగి పడెను, భూజనులందరును అతని నీడను విడిచి అతనిని పడియుండ నిచ్చిరి.

సామెతలు 31:12 (TELUBSI)

ఆమె తాను బ్రదుకు దినములన్నియు అతనికి మేలుచేయును గాని కీడేమియు చేయదు.

యిర్మీయా 31:12 (TELUBSI)

వారు వచ్చి సీయోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు; యెహోవాచేయు ఉపకారమునుబట్టియు గోధుమలనుబట్టియు ద్రాక్షారసమునుబట్టియు తైలమునుబట్టియు, గొఱ్ఱెలకును పశువులకును పుట్టు పిల్లలనుబట్టియు సమూహములుగా వచ్చెదరు; వారిక నెన్నటికిని కృశింపక నీళ్లుపారు తోటవలె నుందురు.

2 దినవృత్తాంతములు 31:12 (TELUBSI)

వారు వాటిని సిద్ధపరచి ఏమియు అపహరింపకుండ కానుకలను పదియవభాగములను ప్రతిష్ఠితములుగా తేబడిన వస్తువులను లోపల చేర్చిరి; లేవీయుడైన కొనన్యా వాటిమీద విచారణకర్తగా నియమింప బడెను; అతని సహోదరుడైన షిమీ అతనికి సహకారిగా ఉండెను.

1 సమూయేలు 31:12 (TELUBSI)

బలశాలులందరు లేచి రాత్రియంత నడిచి సౌలు మొండెమును అతని కుమారుల కళేబరములను బేత్షాను పట్టణపు గోడమీదనుండి దించి యాబేషునకు తిరిగి వచ్చి వాటిని దహనముచేసి

ఆదికాండము 32:31 (TELUBSI)

అతడు పెనూయేలునుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయెను; అప్పుడతడు తొడకుంటుచు నడిచెను.

ఆదికాండము 42:31 (TELUBSI)

అప్పుడు–మేము యథార్థవంతులము, వేగులవారము కాము.