కోసం శోధన ఫలితాలు: exodus 3:1
1 యోహాను 3:18 (TELUBSI)
చిన్నపిల్లలారా, మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమింతము.
1 కొరింథీయులకు 3:1 (TELUBSI)
సహోదరులారా, ఆత్మసంబంధులైన మనుష్యులతో మాటలాడినట్లు నేను మీతో మాటలాడలేక పోతిని. శరీర సంబంధులైన మనుష్యులే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు, మీతో మాటలాడవలసివచ్చెను.
1 కొరింథీయులకు 3:10 (TELUBSI)
దేవుడు నాకనుగ్రహించిన కృపచొప్పున నేను నేర్పరి యైన శిల్పకారునివలె పునాదివేసితిని, మరియొకడు దాని మీద కట్టుచున్నాడు; ప్రతివాడు దానిమీద ఏలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను.
1 కొరింథీయులకు 3:11 (TELUBSI)
వేయబడినది తప్ప, మరియొక పునాది ఎవడును వేయనేరడు; ఈ పునాది యేసుక్రీస్తే.
1 కొరింథీయులకు 3:14 (TELUBSI)
పునాదిమీద ఒకడు కట్టిన పని నిలిచినయెడల వాడు జీతము పుచ్చు కొనును.
1 కొరింథీయులకు 3:15 (TELUBSI)
ఒకని పని కాల్చివేయబడినయెడల వానికి నష్టము కలుగును; అతడు తనమట్టుకు రక్షింపబడును గాని అగ్నిలోనుండి తప్పించుకొన్నట్టు రక్షింపబడును.
1 కొరింథీయులకు 3:16 (TELUBSI)
మీరు దేవుని ఆలయమై యున్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా?
1 కొరింథీయులకు 3:17 (TELUBSI)
ఎవడైనను దేవుని ఆలయమును పాడుచేసినయెడల దేవుడు వానిని పాడుచేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై యున్నది; మీరు ఆ ఆలయమై యున్నారు.
1 కొరింథీయులకు 3:18 (TELUBSI)
ఎవడును తన్నుతాను మోసపరచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొనినయెడల, జ్ఞాని అగునట్టు వెఱ్ఱివాడు కావలెను.
1 కొరింథీయులకు 3:19 (TELUBSI)
ఈ లోక జ్ఞానము దేవునిదృష్టికి వెఱ్ఱితనమే.
1 థెస్సలొనీకయులకు 3:1 (TELUBSI)
కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్సులో మేమొంటిగానైనను ఉండుట మంచిదని యెంచి,
1 థెస్సలొనీకయులకు 3:11 (TELUBSI)
మన తండ్రియైన దేవుడును మన ప్రభువైన యేసును మమ్మును నిరాటంకముగా మీయొద్దకు తీసికొని వచ్చును గాక.
1 తిమోతికి 3:1 (TELUBSI)
ఎవడైనను అధ్యక్షపదవిని ఆశించినయెడల అట్టివాడు దొడ్డపనిని అపేక్షించుచున్నాడను మాట నమ్మదగినది.
1 తిమోతికి 3:10 (TELUBSI)
మరియు వారు మొదట పరీక్షింపబడవలెను; తరువాత వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చును.
1 తిమోతికి 3:11 (TELUBSI)
అటువలె పరిచర్యచేయు స్త్రీలును మాన్యులై కొండెములు చెప్పనివారును, మితాను భవముగలవారును, అన్ని విషయములలో నమ్మకమైనవారునై యుండవలెను.
1 తిమోతికి 3:12 (TELUBSI)
పరిచారకులు ఏకపత్నీ పురుషులును, తమ పిల్లలను తమ యింటివారిని బాగుగా ఏలువారునై యుండవలెను.
1 తిమోతికి 3:13 (TELUBSI)
పరిచారకులై యుండి ఆ పనిని బాగుగా నెరవేర్చినవారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తుయేసునందలి విశ్వాసమందు బహు ధైర్యముగలవారగుదురు.
1 తిమోతికి 3:14 (TELUBSI)
శీఘ్రముగా నీయొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను;
1 తిమోతికి 3:15 (TELUBSI)
అయినను నేను ఆలస్యముచేసినయెడల దేవుని మందిరములో, అనగా జీవముగల దేవుని సంఘములో, జను లేలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని యీ సంగతులను నీకు వ్రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై యున్నది.
1 తిమోతికి 3:16 (TELUBSI)
నిరా క్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైయున్నది; ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను. ఆత్మవిషయమున నీతిపరుడని తీర్పునొందెను దేవదూతలకు కనబడెను రక్షకుడని జనములలో ప్రకటింపబడెను లోకమందు నమ్మబడెను ఆరోహణుడై తేజోమయుడయ్యెను.
1 పేతురు 3:10 (TELUBSI)
–జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదాని పలుకకుండ తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండ తన పెదవులను కాచుకొనవలెను.
1 పేతురు 3:11 (TELUBSI)
అతడు కీడునుండి తొలగి మేలుచేయవలెను, సమాధానమును వెదకి దాని వెంటాడవలెను.
1 పేతురు 3:12 (TELUBSI)
ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడుచేయువారికి విరోధముగా ఉన్నది.