తీతుకు 2:5-6
తీతుకు 2:5-6 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
స్వీయ నియంత్రణ కలిగి పవిత్రులుగా ఉండమని, తమ గృహాలలో పనులను చేసుకుంటూ దయ కలిగి ఉండమని, తన భర్తలకు విధేయత కలిగి ఉండమని బోధించగలరు, అప్పుడు దేవుని వాక్యాన్ని ఎవరూ దూషించలేరు. అదే విధంగా, స్వీయ నియంత్రణ కలిగి ఉండమని యవ్వన పురుషులను ప్రోత్సహించు.
తీతుకు 2:4-6 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
దేవుని వాక్యానికి చెడ్డ పేరు రాకుండేలా తమ భర్తలను, పిల్లలను ప్రేమతో చూసుకోవాలని యువతులను ప్రోత్సహిస్తూ, మనసును అదుపులో ఉంచుకుంటూ, శీలవతులుగా, తమ ఇంటిని శ్రద్ధగా చక్కబెట్టుకొనేవారుగా, తమ భర్తలకు లోబడుతూ ఉండాలని వృద్ధ స్త్రీలు వారికి బోధించాలి. అలానే మనసు అదుపులో ఉంచుకోవాలని యువకులను హెచ్చరించు.
తీతుకు 2:5-6 పవిత్ర బైబిల్ (TERV)
ఆత్మనిగ్రహం కలిగి ఉండి పవిత్రంగా జీవించాలని, తమ గృహనిర్వాహక కర్తవ్యాలను పూర్తి చెయ్యాలని, దయను అలవరచుకోవాలని, వారి భర్తలకు విధేయతగా ఉండాలని ఉపదేశించి శిక్షణనిస్తారు. అప్పుడు దైవసందేశాన్ని ఎవ్వరూ విమర్శించరు. అదే విధంగా మనోనిగ్రహం కలిగి ఉండమని యువకులకు బోధించు.
తీతుకు 2:3-6 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆలాగుననే వృద్ధీస్తలు కొండెకత్తెలును, మిగుల మద్యపానాసక్తులునై యుండక, ప్రవర్తనయందు భయభక్తులుగలవారై యుండవలెననియు, దేవునివాక్యము దూషింపబడకుండునట్లు, యౌవనస్త్రీలు తమ భర్తలకు లోబడియుండి తమ భర్తలను శిశువులను ప్రేమించు వారును స్వస్థబుద్ధిగలవారును పవిత్రులును ఇంట ఉండి పనిచేసికొనువారును మంచివారునై యుండవలెనని బుద్ధిచెప్పుచు, మంచి ఉపదేశముచేయువారునై యుండవలెననియు బోధించుము. అటువలెనే స్వస్థబుద్దిగలవారై యుండవలెనని యౌవనపురుషులను హెచ్చరించుము.