పరమగీతము 7:6-10
పరమగీతము 7:6-10 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
నా ప్రియులారా, నీకు ఆనందకరమైన వాటితో, నీవు ఎంత అందంగా ఉన్నావు ఎంత ఆహ్లాదకరంగా ఉన్నావు. నీ రూపం తాటి చెట్టులా నీ స్తనములు గెలల్లా ఉన్నాయి. నేనన్నాను, “నేను తాటి చెట్టు ఎక్కుతాను; దాని ఫలములు పట్టుకుంటాను.” నీ స్తనములు ద్రాక్షవల్లికి ఉండే ద్రాక్ష గెలల్లా ఉండును గాక. నీ శ్వాస యొక్క పరిమళం ఆపిల్ పండ్ల వాసనలా ఉంది. నీ నోరు శ్రేష్ఠమైన ద్రాక్షరసంలా ఉంది. ద్రాక్షరసం పెదవులు పళ్ల మీదుగా సున్నితంగా ప్రవహిస్తూ నా ప్రియుని దగ్గరకు వెళ్లును గాక. నేను నా ప్రియుని దానను, ఆయనకు నా పట్ల వాంఛ.
పరమగీతము 7:6-10 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నా ప్రేయసీ, నీ హర్షంతో నువ్వెంత అందంగా లలిత లావణ్యంగా ఉన్నావు! నువ్వు తాడి చెట్టులా తిన్నగా ఉన్నావు. నీ స్తనాలు పండ్ల గెలల్లా ఉన్నాయి. “ఆ తాడి చెట్టు ఎక్కుతాను. దాని కొమ్మలు పట్టుకుంటాను” అనుకున్నాను. నీ స్తనాలు ద్రాక్షగెలల్లా, నీ శ్వాస సీమ బాదం వాసనలా ఉండాలి. నీ నోరు శ్రేష్ఠమైన ద్రాక్షారసంలా ఉండాలి. మన పెదాల మధ్య, పళ్ళ మధ్య చక్కగా స్రవిస్తూ ఉండాలి. (యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది) నేను నా ప్రియుడికి చెందిన దాన్ని. అతడు నా కోసం తహతహలాడుతున్నాడు.
పరమగీతము 7:6-10 పవిత్ర బైబిల్ (TERV)
నీవు అతీత సుందరివి! అత్యంత మనోహరివి! అందమైన, ఆహ్లాదకరమైన యువతివి! నీవు తాళవృక్షంలా పొడుగరివి. నీ స్తనాలు తాటిపళ్ల గెలల్లా వున్నాయి. నాకు ఆ చెట్టుపైకి ఎక్కాలని, దాని మట్టలు పట్టాలని ఉంది. నీ స్తనాలు ద్రాక్షా గుత్తుల్లా, నీ ఊపిరి జల్దరు సువాసనలా ఉన్నాయి. నీ నోరు శ్రేష్ఠమైన ద్రాక్షారసంలా, అది నిద్రించే వారి ప్రేమ పెదవులకు జాలువారేదిలా ఉంది. నేను నా ప్రియునిదానను నాయందు అతనికి వాంఛ ఉంది!
పరమగీతము 7:6-10 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నా ప్రియురాలా, ఆనందకరమైనవాటిలో నీవు అతిసుందరమైనదానవు అతి మనోహరమైనదానవు. నీవు తాళవృక్షమంత తిన్ననిదానవు నీ కుచములు గెలలవలె నున్నవి. తాళవృక్షము నెక్కుదుననుకొంటిని దాని శాఖలను పట్టుకొందుననుకొంటిని నీ కుచములు ద్రాక్షగెలలవలె నున్నవి. నీ శ్వాసవాసన జల్దరుఫల సువాసనవలె నున్నది. నీ నోరు శ్రేష్ఠద్రాక్షారసమువలె నున్నది ఆ శ్రేష్ఠద్రాక్షారసము నా ప్రియునికి మధుర పానీయము అది నిద్రితుల యధరములు ఆడజేయును. నేను నా ప్రియునిదానను అతడు నాయందు ఆశాబద్ధుడు.