Skip to content

రూతు 4:6 - అన్ని సంస్కరణలను పోల్చండి

రూతు 4:6 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ఆ బంధువుడు– నేను దానిని విడిపించుకొనలేను, నా స్వాస్థ్యమును పోగొట్టుకొందునేమో, నేను దాని విడిపింపలేను గనుక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మము జరిగించుమని చెప్పెను.

రూతు 4 TELUBSI

రూతు 4:6 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

దానికి ఆ బంధువు “నేను దాన్ని విడిపిస్తే నా సొంత వారసత్వం పాడవుతుంది. కాబట్టి దాన్ని విడిపించే ఆ హక్కు నువ్వే తీసుకో. ఎందుకంటే నేను ఆ భూమిని విడిపించుకోలేను” అన్నాడు.

రూతు 4 IRVTEL

రూతు 4:6 TERV (పవిత్ర బైబిల్)

ఆ దగ్గరి బంధువు జవాబుగా అన్నాడు: “నేను ఆ భూమిని కొనలేను. ఆ భూమి నాకు చెందాల్సిందే, కాని నేను దాన్ని కొనలేను. ఒకవేళ నేను దాన్ని కొనాల్సివస్తే, నా సొంత భూమిని పోగొట్టుకోవాల్సి వస్తుందేమో. అందుచేత నీవు ఆ భూమిని కొనవచ్చు.”

రూతు 4 TERV

రూతు 4:6 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

ఇది విని, ఆ బంధువు, “అయితే నేను దానిని విడిపించలేను, ఎందుకంటే నా స్వాస్థ్యాన్ని కోలిపోతానేమో. నీవే దానిని విడిపించు. నేను చేయలేను” అని అన్నాడు.

రూతు 4 TSA