Skip to content

రూతు 3:9 - అన్ని సంస్కరణలను పోల్చండి

రూతు 3:9 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

అతడు–నీ వెవరవని అడుగగా ఆమె– నేను రూతు అను నీ దాసురాలిని; నీవు నాకు సమీప బంధువుడవు గనుక నీ దాసురాలిమీద నీ కొంగు కప్పుమనగా

రూతు 3 TELUBSI

రూతు 3:9 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

అతడు, “ఎవరు నువ్వు?” అని అడిగాడు. ఆమె “నేను రూతు అనే నీ దాసిని. నువ్వు నన్ను విడిపించగల సమీప బంధువువి. నాపై నీ కొంగు కప్పు” అంది.

రూతు 3 IRVTEL

రూతు 3:9 TERV (పవిత్ర బైబిల్)

“ఎవరు నీవు” అన్నాడు బోయజు. “నీ సేవకురాలనైన రూతును. నన్ను కాపాడాల్సింది నీవే. నీ దుప్పటి నా మీద కప్పు” అన్నది రూతు.

రూతు 3 TERV

రూతు 3:9 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

“ఎవరు నీవు?” అని అతడు అడిగాడు. రూతు జవాబిస్తూ, “నేను రూతును, మీ దాసురాలిని, మీరు నన్ను విడిపించగల సమీపబంధువు కాబట్టి నా మీద మీ వస్త్రం కప్పండి” అన్నది.

రూతు 3 TSA