రోమా 2:2-3 - అన్ని సంస్కరణలను పోల్చండి

రోమా 2:2-3 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

అట్టి కార్యములు చేయువారిమీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని యెరుగుదుము. అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుష్యుడా, నీవు దేవుని తీర్పు తప్పించు కొందువని అనుకొందువా?

షేర్ చేయి
రోమా 2 TELUBSI

రోమా 2:2-3 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ఆ పనులు చేసే వారి మీద దేవుని తీర్పు న్యాయమైనదే అని మనకు తెలుసు. ఆ పనులు చేసే వారికి తీర్పు తీరుస్తూ వాటినే చేస్తున్న ఓ మనిషీ, దేవుని తీర్పు నీవెలా తప్పించుకుంటావు?

షేర్ చేయి
రోమా 2 IRVTEL

రోమా 2:2-3 TERV (పవిత్ర బైబిల్)

దేవుడు అలాంటి దుర్మార్గపు పనులు చేస్తున్నవాళ్ళకు సత్యం ఆధారం మీద న్యాయమైన శిక్ష విధిస్తాడని మనకు తెలుసు. మిత్రమా! ఏ కారణాలవల్ల నీవు వాళ్ళపై తీర్పు చెపుతున్నావో అవే పనులు నీవు కూడా చేస్తున్నావు. మరి అలాంటప్పుడు దేవుని శిక్షను తప్పించుకోగలనని ఎలా అనుకుంటున్నావు?

షేర్ చేయి
రోమా 2 TERV

రోమా 2:2-3 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

అలాంటి కార్యాలు చేసేవారి పట్ల సత్యాన్ని అనుసరించి దేవుని తీర్పు ఉంటుందని మనకు తెలుసు. కాబట్టి అలాంటివి చేసేవారికి తీర్పు తీరుస్తూ వాటినే చేస్తూ ఉన్న సాధారణ మనుష్యులైన మీరు దేవుని తీర్పును తప్పించుకోగలరని అనుకుంటున్నారా?

షేర్ చేయి
రోమా 2 TSA