రోమా 16:27 - అన్ని సంస్కరణలను పోల్చండి
రోమా 16:25-27 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు, అనాదినుండి రహస్యముగా ఉంచబడి యిప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము, నిత్యదేవుని ఆజ్ఞప్రకారము ప్రవక్తల లేఖనములద్వారా వారికి తెలుపబడియున్నది. ఈ మర్మమును అనుసరించియున్న నా సువార్త ప్రకారము గాను, యేసు క్రీస్తునుగూర్చిన ప్రకటన ప్రకారముగాను, మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి, యేసుక్రీస్తుద్వారా, నిరంతరము మహిమ కలుగునుగాక. ఆమేన్.
రోమా 16:27 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఏకైక జ్ఞానవంతుడైన దేవునికి, యేసు క్రీస్తు ద్వారా నిరంతరం మహిమ కలుగు గాక. ఆమేన్.
రోమా 16:27 TERV (పవిత్ర బైబిల్)
సర్వజ్ఞుడైనటువంటి దేవునికి, యేసు క్రీస్తు ద్వారా సదా మహిమ కలుగుగాక! ఆమేన్.
రోమా 16:25-27 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యూదేతరులంతా విశ్వాసానికి విధేయులు కావాలని, అనాది కాలం నుండి రహస్యంగా దాచబడి, ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మం, నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారం వ్రాయబడిన ప్రవచనాత్మక లేఖనాల ద్వారా ఇప్పుడు వారికి తెలియపరచబడింది. ఆ మర్మానికి అనుగుణంగా నేను ప్రకటిస్తున్న యేసు క్రీస్తు గురించిన సువార్త ప్రకారం మిమ్మల్ని స్థిరపరచగల సమర్థుడును ఏకైక జ్ఞానవంతుడునైన దేవునికి యేసు క్రీస్తు ద్వారా శాశ్వత మహిమ కలుగును గాక! ఆమేన్.