రోమా 12:17-21

రోమా 12:17-21 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

చెడుకు ప్రతిగా ఎవరికి చెడు చేయకండి. అందరి దృష్టికి సరియైనవిగా ఉన్నవాటిని చేసేలా జాగ్రత్తపడండి. మీకు సాధ్యమైనంత వరకు అందరితో సమాధానం కలిగి జీవించండి. నా ప్రియ స్నేహితులారా, పగ తీర్చుకోకండి కాని, “పగ తీర్చుకోవడం నా పని, వారికి తగిన ప్రతిఫలాన్ని ఇస్తానని ప్రభువు చెప్పారు” అని వ్రాయబడిన ప్రకారం దేవుని ఉగ్రతకు విడిచిపెట్టండి. అయితే, “మీ శత్రువు ఆకలితో ఉంటే వానికి ఆహారం పెట్టండి; అతడు దాహంతో ఉంటే వానికి త్రాగడానికి ఇవ్వండి. మీరు ఇలా చేయడం ద్వారా అతని తలపై మండుతున్న నిప్పులు కుప్పగా పోస్తారు.” చెడును మీమీద గెలవనివ్వక, మంచితో చెడును ఓడించండి.

షేర్ చేయి
చదువండి రోమా 12

రోమా 12:17-21 పవిత్ర బైబిల్ (TERV)

కీడు చేసినవాళ్ళకు కీడు చెయ్యకండి. ప్రతి ఒక్కరి దృష్టిలో మంచిదనిపించేదాన్ని చెయ్యటానికి జాగ్రత్త పడండి. అందరితో శాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. మిత్రులారా! పగ తీర్చకోకండి. ఆగ్రహం చూపటానికి దేవునికి అవకాశం ఇవ్వండి. ఎందుకంటే లేఖనాల్లో, “పగ తీర్చుకోవటం నా వంతు. నేను ప్రతీకారం తీసుకొంటాను” అని వ్రాయబడి ఉంది. దానికి మారుగా, “మీ శత్రువు ఆకలితో ఉంటే అతనికి ఆహారం ఇవ్వండి. అతనికి దాహం వేస్తుంటే నీళ్ళివ్వండి. ఇలా చేయటం వల్ల కాలే నిప్పులు అతని తలపై కుమ్మరించినట్లు అతనికి అనిపిస్తుంది” అని వ్రాయబడి ఉంది. చెడు మీపై గెలుపు సాధించకుండా జాగ్రత్త పడండి. చెడ్డతనాన్ని మంచితనంతో గెలవండి.

షేర్ చేయి
చదువండి రోమా 12

రోమా 12:17-21 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు; మనుష్యులందరి దృష్టికి యోగ్యమైనవాటినిగూర్చి ఆలోచన కలిగి యుండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగతీర్చుకొనక, దేవుని ఉగ్రతకు చోటియ్యుడి–పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి యున్నది. కాబట్టి, నీ శత్రువు ఆకలిగొనియుంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొనియుంటే దాహ మిమ్ము; ఆలాగు చేయుటవలన అతని తలమీద నిప్పులు కుప్పగా పోయుదువు. కీడువలన జయింపబడక, మేలు చేత కీడును జయించుము.

షేర్ చేయి
చదువండి రోమా 12