రోమా 1:16 - Compare All Versions
రోమా 1:16 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
సువార్త గురించి నేను సిగ్గుపడను. ఎందుకంటే నమ్మిన ప్రతివారికి అనగా మొదట యూదులకు తర్వాత యూదేతరులకు రక్షణ కలుగజేయడానికి సువార్త దేవుని శక్తి.
షేర్ చేయి
రోమా 1 TSAరోమా 1:16 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
సువార్తను గురించి నేను సిగ్గుపడను. ఎందుకంటే మొదట యూదుడికి, తరవాత గ్రీసు జాతి వాడికి నమ్మే ప్రతి ఒక్కరికీ అది దేవుని శక్తి.
షేర్ చేయి
రోమా 1 IRVTELరోమా 1:16 TERV (పవిత్ర బైబిల్)
సువార్త విషయంలో నేను సిగ్గుపడను. ఎందుకంటే, విశ్వాసమున్న ప్రతి ఒక్కరికీ, అంటే యూదులకే కాక ఇతరులకు కూడా రక్షణను కలిగించే దేవుని శక్తి అది.
షేర్ చేయి
రోమా 1 TERVరోమా 1:16 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
సువార్తనుగూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసుదేశస్థునికి కూడ రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియై యున్నది.
షేర్ చేయి
రోమా 1 TELUBSI