ప్రకటన 3:5 - Compare All Versions
ప్రకటన 3:5 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
జయించేవారు వారిలా తెల్లని వస్త్రాలు ధరించుకొంటారు. వాని పేరును నేను జీవగ్రంథంలో నుండి ఎన్నడు తుడిచివేయను. నా తండ్రి ముందు, ఆయన దూతల ముందు వాని పేరును ఒప్పుకుంటాను.
షేర్ చేయి
ప్రకటన 3 TSAప్రకటన 3:5 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
జయించేవాడు తెల్లటి దుస్తులు వేసుకుంటాడు. జీవగ్రంథంలో నుండి అతని పేరును నేను ఎన్నటికీ తుడిచివేయను. అంతే కాకుండా నా తండ్రి ఎదుటా ఆయన దూతల ఎదుటా అతడి పేరు ఒప్పుకుంటాను.
షేర్ చేయి
ప్రకటన 3 IRVTELప్రకటన 3:5 TERV (పవిత్ర బైబిల్)
విజయం సాధించిన వాళ్ళలా తెల్లని దుస్తులు ధరించండి. అలా చేసినవాని పేరును నేను జీవగ్రంథంనుండి తుడిచివేయను. అతణ్ణి నా తండ్రి ముందు, దేవదూతల ముందు అంగీకరిస్తాను.
షేర్ చేయి
ప్రకటన 3 TERVప్రకటన 3:5 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
జయించు వాడు ఆలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును; జీవ గ్రంథములోనుండి అతని పేరెంతమాత్రమును తుడుపు పెట్టక, నాతండ్రి యెదుటను ఆయన దూతల యెదుటను అతని పేరు ఒప్పుకొందును.
షేర్ చేయి
ప్రకటన 3 TELUBSI