ప్రకటన 13:16-17 - Compare All Versions

ప్రకటన 13:16-17 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

ఇంకా ఆ రెండవ మృగం ఘనులైనా అల్పులైనా, ధనవంతులైనా పేదవారైనా, స్వతంత్రులైనా దాసులైనా సరే అందరు తమ కుడిచేతి మీద గాని నుదుటి మీద గాని ముద్ర వేసుకోవాలని వారిని బలవంతం చేస్తుంది. ఎందుకంటే ఈ ముద్రను వేసుకునేవారు తప్ప మరి ఎవరూ అమ్ముకోలేరు కొనుక్కోలేరు. ఈ ముద్ర మృగం పేరుకు ఆ మృగం పేరుకు గల సంఖ్యకు నిదర్శనంగా ఉంది.

షేర్ చేయి
ప్రకటన 13 TSA

ప్రకటన 13:16-17 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ఇంకా తమ కుడి చేతిపై గానీ నుదిటిపై గానీ ముద్ర వేయించుకోవాలని ప్రముఖులనూ, అనామకులనూ, ధనవంతులనూ, నిరుపేదలనూ, స్వతంత్రులనూ, బానిసలనూ అందర్నీ వాడు బలవంతం చేశాడు. ఆ ముద్ర, అంటే ఆ మృగం పేరు గానీ వాడి సంఖ్య గానీ లేకుండా ఎవరికైనా అమ్మడం గానీ కొనడం గానీ అసాధ్యం.

షేర్ చేయి
ప్రకటన 13 IRVTEL

ప్రకటన 13:16-17 TERV (పవిత్ర బైబిల్)

అంతేకాక చిన్నా, పెద్దా, ధనికుడూ, పేదవాడు, బానిస, స్వతంత్రుడు అనే భేదం లేకుండా ప్రతి ఒక్కడూ తన కుడి చేతి మీదగాని, నుదుటిమీదగాని, ఒక ముద్ర వేసుకోవాలని నిర్బంధం చేసింది. ఈ ముద్ర లేకుండా ఎవ్వరూ అమ్మటం కాని, కొనటం కాని, చేయరాదని యిలా చేసింది. ఈ ముద్రలలో ఆ మృగం పేరు, లేక దాని పేరుతో సంఖ్య వ్రాయబడి ఉంది.

షేర్ చేయి
ప్రకటన 13 TERV

ప్రకటన 13:16-17 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

కాగా కొద్దివారుగాని గొప్పవారుగాని, ధనికులుగాని దరి ద్రులుగాని, స్వతంత్రులుగాని దాసులుగాని, అందరును తమ కుడిచేతిమీదనైనను తమ నొసటియందైనను ముద్ర వేయించుకొనునట్లును, ఆ ముద్ర, అనగా ఆ మృగము పేరైనను దాని పేరిటి సంఖ్యయైనను గలవాడు తప్ప, క్రయ విక్రయములు చేయుటకు మరి యెవనికిని అధికారములేకుండునట్లును అది వారిని బలవంతము చేయుచున్నది.

షేర్ చేయి
ప్రకటన 13 TELUBSI