కీర్తనలు 71:23-24 - Compare All Versions

కీర్తనలు 71:23-24 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

మీరు విడిపించిన నేను మీకు స్తుతి పాడినప్పుడు నా పెదవులు ఆనందంతో కేకలు వేస్తాయి. రోజంతా నా నాలుక మీ నీతిక్రియలను గురించి చెప్తుంది, ఎందుకంటే నాకు హాని చేయాలని కోరుకున్నవారు అవమానం పొంది గందరగోళానికి గురి అయ్యారు.

షేర్ చేయి
కీర్తనలు 71 TSA

కీర్తనలు 71:23-24 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

నేను నిన్ను కీర్తిస్తూ ఉన్నప్పుడు నా పెదాలు, నువ్వు విమోచించిన నా ప్రాణం నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేస్తాయి. నాకు హాని కలిగించాలని ప్రయత్నించే వాళ్ళు అవమానం పాలై అయోమయంలో ఉన్నారు. అయితే నా నాలుక రోజంతా నీ నీతిని వివరిస్తూ ఉంది.

షేర్ చేయి
కీర్తనలు 71 IRVTEL

కీర్తనలు 71:23-24 TERV (పవిత్ర బైబిల్)

నీవు నా ఆత్మను రక్షించావు. నా ఆత్మ సంతోషంగా ఉంటుంది. నేను నా పెదవులతో స్తుతి కీర్తనలు పాడుతాను. అన్ని వేళలా నా నాలుక నీ మంచితనమును గూర్చి పాడుతుంది. నన్ను చంపాలని కోరే ప్రజలు ఓడించబడి అవమానం పొందుతారు.

షేర్ చేయి
కీర్తనలు 71 TERV

కీర్తనలు 71:23-24 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

నేను నిన్ను కీర్తించునప్పుడు నా పెదవులును నీవు విమోచించిన నా ప్రాణమును నిన్నుగూర్చి ఉత్సాహధ్వని చేయును. నాకు కీడుచేయజూచువారు సిగ్గుపడియున్నారువారు అవమానము పొందియున్నారు కాగా నా నాలుక దినమెల్ల నీ నీతిని వర్ణించును.

షేర్ చేయి
కీర్తనలు 71 TELUBSI