కీర్తనలు 71:15-18
కీర్తనలు 71:15-18 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
రోజంతా నా నోరు మీ నీతిక్రియలను గురించి, రక్షణక్రియలను గురించి చెప్తుంది. అవి నా గ్రహింపుకు అందనివి. ప్రభువైన యెహోవా, నేను వచ్చి మీ గొప్ప కార్యాలను ప్రకటిస్తాను; కేవలం మీ నీతిక్రియలను మాత్రమే నేను ప్రకటిస్తాను. దేవా! నా యవ్వనం నుండి మీరు నాకు బోధించారు, ఈ రోజు వరకు నేను మీ అద్భుత క్రియలను ప్రకటిస్తున్నాను. నేను వృద్ధుడనై తల నెరసినప్పటికి, నా దేవా, తర్వాత తరానికి మీ శక్తిని, రాబోయే వారందరికి మీ గొప్ప కార్యాలను ప్రకటించే వరకు నన్ను విడిచిపెట్టకండి.
కీర్తనలు 71:15-18 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నీ నీతిని, నీ రక్షణను రోజంతా వివరిస్తాను. వాటిని నేను లెక్కించలేను. ప్రభువైన యెహోవా బలమైన కార్యాలను నేను వర్ణించడం మొదలు పెడతాను. నీ నీతిని మాత్రమే నేను వివరిస్తాను. దేవా, నా బాల్యం నుండి నువ్వు నాకు బోధిస్తూ వచ్చావు. ఇప్పటి వరకూ నీ ఆశ్చర్య కార్యాలను నేను తెలియజేస్తూనే ఉన్నాను. దేవా, నేను తల నెరిసి ముసలివాడినైనా నన్ను విడిచిపెట్టకు. రాబోయే తరాలకు నీ బలప్రభావాల గురించి, ఇకపై పుట్టబోయే వాళ్లకు నీ శక్తియుక్తులను గురించి వివరిస్తాను.
కీర్తనలు 71:15-18 పవిత్ర బైబిల్ (TERV)
నీవు ఎంత మంచివాడవో దానిని నేను ప్రజలకు చెబుతాను. నీవు నన్ను రక్షించిన సమయాలను గూర్చి నేను ప్రజలతో చెబుతాను. లెక్కించేందుకు అవి ఎన్నెన్నో సమయాలు. యెహోవా, నా ప్రభూ, నీ గొప్పతనాన్ని గూర్చి నేను చెబుతాను. నిన్ను గూర్చి నీ మంచితనం గూర్చి మాత్రమే నేను మాట్లాడుతాను. దేవా, నేను చిన్నవానిగా ఉన్నప్పటి నుండి నీవు నాకు నేర్పించావు. నీవు చేసే అద్భుత విషయాలను గూర్చి ఈనాటివరకు నేను చెబుతూనే ఉన్నాను. దేవా, నేను తల నెరసిన వృద్ధుడుగా ఉన్నప్పుడు కూడా నన్ను విడిచిపెట్టవని నాకు తెలుసు. నీ శక్తి, గొప్పదనాలను గూర్చి ప్రతి క్రొత్త తరానికీ నేను చెబుతాను.
కీర్తనలు 71:15-18 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్ల వివరించును అవి నాకు ఎన్నశక్యము కావు. ప్రభువైన యెహోవాయొక్క బలవత్కార్యములను బట్టి నేను వర్ణింప మొదలుపెట్టెదను నీ నీతినిమాత్రమే నేను వర్ణించెదను. దేవా, బాల్యమునుండి నీవు నాకు బోధించుచు వచ్చితివి ఇంతవరకు నీ ఆశ్చర్యకార్యములు నేను తెలుపుచునే వచ్చితిని. దేవా, వచ్చుతరమునకు నీ బాహుబలమునుగూర్చియు పుట్టబోవువారికందరికి నీ శౌర్యమునుగూర్చియు నేను తెలియజెప్పునట్లు తల నెరసి వృద్ధునైయుండు వరకు నన్ను విడువకుము.