కీర్తనలు 68:6-10
కీర్తనలు 68:6-10 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
దేవుడు ఒంటరిగా ఉన్నవారిని కుటుంబాలలో ఉంచుతారు, బందీలను విడిపించి వారికి ఆనందాన్ని అనుగ్రహిస్తారు; కాని తిరుగుబాటుదారులు ఎండిన భూమిలో నివసిస్తారు. దేవా! మీ ప్రజలకు ముందుగా మీరు వెళ్లారు, అరణ్యం గుండా మీరు నడిచారు. సెలా సీనాయి యొక్క ఏకైక దేవుని ముందు, ఇశ్రాయేలు దేవుని ముందు, భూమి కంపించింది, ఆకాశాలు వాన కురిపించాయి. దేవా, మీరు స్వచ్ఛందంగా సమృద్ధి వర్షాన్ని ఇచ్చారు; నీరసించిన మీ వారసత్వాన్ని మీరు ఉత్తేజపరచారు. మీ జనులు అందులో స్థిరపడ్డారు, దేవా, మీ దయతో పేదలకు అవసరమైనవి ఇచ్చారు.
కీర్తనలు 68:6-10 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
దేవుడు ఒంటరి వారిని కుటుంబాలుగా చేస్తాడు. ఆయన బంధకాల్లో ఉన్న వారిని విడిపించి వారిని వృద్ధి చెందిస్తాడు. తిరుగుబాటు చేసే వారి భూములు బీడులైపోతాయి. దేవా, నీవు నీ ప్రజలకు ముందుగా బయలుదేరినప్పుడు అరణ్యంలో ప్రయాణించినప్పుడు దేవుని సన్నిధిలో ఆయన సీనాయి కొండకు వచ్చినపుడు, ఇశ్రాయేలు దేవుని సన్నిధిలో భూమి వణికింది, ఆకాశాలు వర్షించాయి. దేవా, నీ వారసత్వం మీద వర్షం సమృద్ధిగా కురిపించావు. అది అలసి ఉన్నప్పుడు నువ్వు దాన్ని బలపరచావు. నీ ప్రజలు దానిలో నివసిస్తారు. దేవా, నీ మంచితనంతో పేదలను అనుగ్రహించావు.
కీర్తనలు 68:6-10 పవిత్ర బైబిల్ (TERV)
ఒంటరిగా ఉన్న మనుష్యులకు దేవుడు ఒక ఇంటిని ఇస్తాడు. దేవుడు తన ప్రజలను కారాగారం నుండి విడిపిస్తాడు. వారు చాలా సంతోషంగా ఉన్నారు. కాని దేవునికి విరోధంగా తిరిగే మనుష్యులు దహించు సూర్య వేడిమిగల దేశంలో నివసిస్తారు. దేవా, నీ ప్రజలను నీవు ఈజిప్టు నుండి బయటకు రప్పించావు. ఎడారిగుండా నీవు నడిచావు. భూమి కంపించింది. దేవుడు, ఇశ్రాయేలీయుల దేవుడు, సీనాయి కొండ మీదికి వచ్చాడు. మరియు ఆకాశం కరిగిపోయింది. దేవా, నీవు వర్షం కురిపించావు మరియు నిస్సారమైన పాత భూమిని నీవు మరల బలపరిచావు. నీ పశువులు ఆ దేశానికి తిరిగి వచ్చాయి. దేవా, అక్కడ పేద ప్రజలకు నీవు ఎన్నో మంచివాటిని యిచ్చావు.
కీర్తనలు 68:6-10 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ఆయన బంధింపబడినవారిని విడిపించి వారిని వర్ధిల్ల జేయువాడు విశ్వాసఘాతకులు నిర్జలదేశమందు నివసించుదురు. దేవా, నీవు నీ ప్రజలముందర బయలుదేరినప్పుడు అరణ్యములో నీవు ప్రయాణము చేసినప్పుడు (సెలా.) భూమి వణకెను దేవుని సన్నిధిని అంతరిక్షము దిగ జారెను ఇశ్రాయేలు దేవుడగు దేవుని సన్నిధిని ఆవలి సీనాయి కంపించెను. దేవా, నీ స్వాస్థ్యముమీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి అది అలసియుండగా నీవు దానిని బలపరచితివి. నీ సమూహము దానిలో నివసించును దేవా, నీ అనుగ్రహముచేత దీనులకు సదుపాయము కలుగజేసితివి.