కీర్తనలు 67:1-7 - Compare All Versions

కీర్తనలు 67:1-7 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

దేవుడు మామీద దయచూపి దీవించును గాక, ఆయన ముఖం మాపై ప్రకాశించును గాక. సెలా తద్వార భూమి మీద మీ మార్గాలు దేశాలన్నిటికి మీ రక్షణ తెలుస్తాయి, దేవా, జనాంగాలు మిమ్మల్ని స్తుతించును గాక; సర్వ జనులు మిమ్మల్ని స్తుతించుదురు గాక. దేశాలు సంతోషించి ఆనంద గానం చేయుదురు గాక, ఎందుకంటే మీరు జనులను న్యాయంగా పరిపాలిస్తారు భూమి మీద దేశాలను పాలిస్తారు. సెలా దేవా, జనాంగాలు మిమ్మల్ని స్తుతించును గాక; సర్వ జనులు మిమ్మల్ని స్తుతించుదురు గాక. భూమి దాని పంటను ఇస్తుంది; దేవుడు, మా దేవుడు, మమ్మల్ని దీవిస్తారు. అవును, దేవుడు మనల్ని దీవించును గాక, తద్వార భూదిగంతాలలో ఉన్న ప్రజలంతా ఆయనకు భయపడుదురు గాక.

షేర్ చేయి
కీర్తనలు 67 TSA

కీర్తనలు 67:1-7 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

దేవుడు మమ్మల్ని కనికరించి ఆశీర్వదిస్తాడు గాక. ఆయన తన ముఖకాంతి మామీద ప్రకాశింపజేస్తాడు గాక భూమి మీద నీ మార్గాలు, జాతులన్నిటిలో నీ రక్షణ వెల్లడి అయ్యేలా అలా చేస్తాడు గాక. దేవా, ప్రజలు నిన్ను స్తుతిస్తారు గాక. ప్రజలంతా నిన్ను స్తుతిస్తారు గాక. ప్రజలు సంతోషంతో ఆనందగానాలు చేస్తారు. ఎందుకంటే నువ్వు జాతులకు న్యాయంగా తీర్పు తీరుస్తావు. భూరాజ్యాలను ఏలుతావు. దేవా, ప్రజలు నిన్ను స్తుతిస్తారు గాక. ప్రజలందరు నిన్ను స్తుతిస్తారు గాక. అప్పుడు భూమి దాని ఫలాన్ని ఇస్తుంది. దేవుడు, మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. దేవుడు మమ్మల్ని దీవించాడు. భూదిగంతాల ప్రజలు ఆయనలో భయభక్తులు నిలుపుతారు.

షేర్ చేయి
కీర్తనలు 67 IRVTEL

కీర్తనలు 67:1-7 TERV (పవిత్ర బైబిల్)

దేవా, మమ్ములను కనికరించి, మమ్ములను ఆశీర్వదించుము. దయచేసి మమ్ములను స్వీకరించుము. దేవా, భూమి మీద ప్రతి మనిషినీ నిన్ను గూర్చి తెలుసుకోనిమ్ము. నీవు మనుష్యులను ఎలా రక్షిస్తావో ప్రతి దేశం నేర్చుకోనిమ్ము. దేవా, ప్రజలు నిన్ను స్తుతించెదరుగాక! మనుష్యులంతా నిన్ను స్తుతించెదరుగాక! దేశాలన్నీ ఆనందించి, సంతోషించుగాక! ఎందుకంటే నీవు మనుష్యులకు న్యాయంగా తీర్పు తీరుస్తావు మరియు ప్రతి దేశాన్నీ నీవు పాలిస్తావు. దేవా, ప్రజలు నిన్ను స్తుతించెదరు గాక! మనుష్యులంతా నిన్ను స్తుతించెదరు గాక! దేవా, మా దేవా, మమ్మల్ని దీవించుము. మా భూమి మాకు గొప్ప పంట ఇచ్చేటట్టుగా చేయుము. దేవుడు మమ్మల్ని దీవించుగాక. భూమిమీద వున్న ప్రతి ఒక్కరూ దేవునికి భయపడి, ఆయనను గౌరవించెదరు గాక.

షేర్ చేయి
కీర్తనలు 67 TERV

కీర్తనలు 67:1-7 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

భూమిమీద నీ మార్గము తెలియబడునట్లును అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడునట్లును దేవుడు మమ్మును కరుణించి మమ్మును ఆశీర్వదించును గాక ఆయన తన ముఖకాంతి మామీద ప్రకాశింపజేయును గాక. (సెలా.) దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురు గాక. ప్రజలందరు నిన్ను స్తుతించుదురు గాక. న్యాయమునుబట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు భూమిమీదనున్న జనములను ఏలెదవు. (సెలా.) జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయును గాక దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురు గాక. ప్రజలందరు నిన్ను స్తుతించుదురు గాక. అప్పుడు భూమి దాని ఫలములిచ్చును దేవుడు మా దేవుడు మమ్మును ఆశీర్వదించును. దేవుడు మమ్మును దీవించును భూదిగంత నివాసులందరు ఆయనయందు భయభక్తులు నిలుపుదురు.

షేర్ చేయి
కీర్తనలు 67 TELUBSI