కీర్తనలు 55:16-19 - Compare All Versions

కీర్తనలు 55:16-19 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

నేను మాత్రం, దేవునికి మొరపెడతాను, యెహోవా నన్ను రక్షిస్తారు. సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం నేను బాధలో మొరపెడతాను, ఆయన నా స్వరం వింటారు. అనేకులు నన్ను వ్యతిరేకించినప్పటికి, నాకు వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధం నుండి నా ప్రాణాన్ని సమాధానంలో విమోచిస్తారు. పూర్వం నుండి సింహాసనాసీనుడైయున్న మారని దేవుడు, అది విని వారిని అణచివేస్తారు, సెలా వారు మారడానికి ఒప్పుకోరు ఎందుకంటే వారికి దేవుని భయం లేదు.

షేర్ చేయి
కీర్తనలు 55 TSA

కీర్తనలు 55:16-19 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

అయితే నేను దేవునికి మొరపెడతాను. యెహోవా నన్ను రక్షిస్తాడు. సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం ధ్యానిస్తూ మొరపెడతాను. ఆయన నా ప్రార్థన వింటాడు. నా శత్రువులు చాలామంది ఉన్నారు. అయితే వారు నా మీదికి రాకుండా చేసి ఆయన నా ప్రాణాన్ని విమోచించి, శాంతిసమాధానాలు అనుగ్రహించాడు. పూర్వకాలం నుండి ఉన్న దేవుడు మారుమనస్సు లేనివారికి, తనకు భయపడని వారికి జవాబు చెబుతాడు.

షేర్ చేయి
కీర్తనలు 55 IRVTEL

కీర్తనలు 55:16-19 TERV (పవిత్ర బైబిల్)

నేను సహాయం కోసం దేవునికి మొరపెడతాను. యెహోవా నాకు జవాబు ఇస్తాడు. సాయంత్రం, ఉదయం, మధ్యాహ్నం నా ఆరోపణలు దేవునికి నేను చెబుతాను. ఆయన నా మాట వింటాడు. నేను చాలా యుద్ధాలు చేశాను. కాని దేవుడు నన్ను రక్షించాడు. ప్రతి యుద్ధం నుండి క్షేమంగా ఆయన నన్ను తిరిగి తీసుకొని వచ్చాడు. దేవుడు అనాది కాలంనుండి సింహాసనాసీనుడు. నా మొర వింటాడు. ఆయన నా శత్రువులను ఓడిస్తాడు.

షేర్ చేయి
కీర్తనలు 55 TERV

కీర్తనలు 55:16-19 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

అయితే నేను దేవునికి మొఱ్ఱపెట్టుకొందును యెహోవా నన్ను రక్షించును. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొఱ్ఱపెట్టుకొందును ఆయన నా ప్రార్థన నాలకించును నా శత్రువులు అనేకులై యున్నారు అయినను వారు నామీదికి రాకుండునట్లు సమాధానము కలుగజేసి ఆయన నా ప్రాణమును విమోచించియున్నాడు. పురాతనకాలము మొదలుకొని ఆసీనుడగు దేవుడు, మారుమనస్సు లేనివారై తనకు భయపడనివారికి ఉత్తర మిచ్చును.

షేర్ చేయి
కీర్తనలు 55 TELUBSI