కీర్తనలు 55:15-19
కీర్తనలు 55:15-19 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
చెడుతనం నా శత్రువుల నివాసాల్లో వారి హృదయాల్లో ఉంది; కాబట్టి మరణం ఆకస్మికంగా వారి మీదికి వచ్చును గాక, ప్రాణంతోనే వారు క్రింద పాతాళానికి దిగిపోవుదురు గాక. నేను మాత్రం, దేవునికి మొరపెడతాను, యెహోవా నన్ను రక్షిస్తారు. సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం నేను బాధలో మొరపెడతాను, ఆయన నా స్వరం వింటారు. అనేకులు నన్ను వ్యతిరేకించినప్పటికి, నాకు వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధం నుండి నా ప్రాణాన్ని సమాధానంలో విమోచిస్తారు. పూర్వం నుండి సింహాసనాసీనుడైయున్న మారని దేవుడు, అది విని వారిని అణచివేస్తారు, సెలా వారు మారడానికి ఒప్పుకోరు ఎందుకంటే వారికి దేవుని భయం లేదు.
కీర్తనలు 55:15-19 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
చావు వారి మీదికి అకస్మాత్తుగా ముంచుకు వస్తుంది. ప్రాణంతోనే వారు పాతాళానికి దిగిపోతారు. ఎందుకంటే చెడుతనం వారి ఇళ్ళలో, వారి అంతరంగంలో ఉంది. అయితే నేను దేవునికి మొరపెడతాను. యెహోవా నన్ను రక్షిస్తాడు. సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం ధ్యానిస్తూ మొరపెడతాను. ఆయన నా ప్రార్థన వింటాడు. నా శత్రువులు చాలామంది ఉన్నారు. అయితే వారు నా మీదికి రాకుండా చేసి ఆయన నా ప్రాణాన్ని విమోచించి, శాంతిసమాధానాలు అనుగ్రహించాడు. పూర్వకాలం నుండి ఉన్న దేవుడు మారుమనస్సు లేనివారికి, తనకు భయపడని వారికి జవాబు చెబుతాడు.
కీర్తనలు 55:15-19 పవిత్ర బైబిల్ (TERV)
నా శత్రువులు వారి సమయం రాకముందే మరణిస్తారనుకొంటాను. వారు సజీవంగానే సమాధి చేయబడ్తారని ఆశిస్తాను. ఎందుచేతనంటే వారు తమ ఇండ్లలో అలాంటి దారుణ విషయాలకు పథకాలు వేస్తారు. నేను సహాయం కోసం దేవునికి మొరపెడతాను. యెహోవా నాకు జవాబు ఇస్తాడు. సాయంత్రం, ఉదయం, మధ్యాహ్నం నా ఆరోపణలు దేవునికి నేను చెబుతాను. ఆయన నా మాట వింటాడు. నేను చాలా యుద్ధాలు చేశాను. కాని దేవుడు నన్ను రక్షించాడు. ప్రతి యుద్ధం నుండి క్షేమంగా ఆయన నన్ను తిరిగి తీసుకొని వచ్చాడు. దేవుడు అనాది కాలంనుండి సింహాసనాసీనుడు. నా మొర వింటాడు. ఆయన నా శత్రువులను ఓడిస్తాడు.
కీర్తనలు 55:15-19 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
వారికి మరణము అకస్మాత్తుగా వచ్చును గాక సజీవులుగానే వారు పాతాళమునకు దిగిపోవుదురు గాక చెడుతనము వారి నివాసములలోను వారి అంతరంగము నందును ఉన్నది అయితే నేను దేవునికి మొఱ్ఱపెట్టుకొందును యెహోవా నన్ను రక్షించును. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొఱ్ఱపెట్టుకొందును ఆయన నా ప్రార్థన నాలకించును నా శత్రువులు అనేకులై యున్నారు అయినను వారు నామీదికి రాకుండునట్లు సమాధానము కలుగజేసి ఆయన నా ప్రాణమును విమోచించియున్నాడు. పురాతనకాలము మొదలుకొని ఆసీనుడగు దేవుడు, మారుమనస్సు లేనివారై తనకు భయపడనివారికి ఉత్తర మిచ్చును.