కీర్తనలు 52:6-9 - Compare All Versions

కీర్తనలు 52:6-9 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

నీతిమంతులు ఇదంతా చూసి భయభక్తులతో వారు నవ్వుతూ ఇలా అంటారు, “ఇతన్ని చూడండి, దేవున్ని తన బలమైన కోటగా చేసుకోకుండ తనకున్న సంపదలను నమ్ముకుని ఇతరులను నాశనం చేస్తూ బలపడ్డాడు!” కానీ నేను దేవుని నివాసంలో పచ్చని ఒలీవ చెట్టులా ఉన్నాను; నేను ఎల్లప్పుడు, మారని దేవుని ప్రేమను నమ్ముతాను. మీరు చేసిందానికి నేను ఎల్లప్పుడు మీ భక్తుల ఎదుట మిమ్మల్ని స్తుతిస్తాను. మీ నామం ఉత్తమమైనది, కాబట్టి నేను మీ నామంలో నిరీక్షణ కలిగి ఉన్నాను.

షేర్ చేయి
కీర్తనలు 52 TSA

కీర్తనలు 52:6-9 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

న్యాయవంతులు అది చూసి దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటారు. వారు నవ్వుతూ ఇలా అంటారు. చూడండి, ఇతడు దేవుణ్ణి తన బలంగా చేసుకోకుండా తనకున్న అధిక ఐశ్వర్యంపై నమ్మకముంచాడు. నాశనకరమైన తన మార్గంలోనే స్థిరంగా నిలిచాడు. కానీ నేను దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టులాగా ఉన్నాను. దేవుని నిబంధన కృపలో నేను ఎన్నటికీ నమ్మకముంచుతాను. దేవా, నువ్వు చేసిన వాటిని బట్టి నేను నీకు కృతజ్ఞతలు చెప్పుకుంటాను. నీ భక్తుల సమక్షంలో నీ నామాన్ని బట్టి ఆశతో ఎదురుచూస్తాను.

షేర్ చేయి
కీర్తనలు 52 IRVTEL

కీర్తనలు 52:6-9 TERV (పవిత్ర బైబిల్)

మంచి వాళ్లు ఇది చూచి, దేవునిని గౌరవిస్తారు. వారు నిన్ను చూచి నవ్వి ఇలా అంటారు, “దేవుని మీద ఆధారపడని ఆ మనిషికి ఏమి సంభవించిందో చూడండి. ఆ మనిషి తనకు సహాయం చేసేందుకు ఐశ్వర్యాన్ని, తనకున్న దానిని మూర్ఖంగా నమ్ముకున్నాడు.” అయితే దేవుని ఆలయంలో నేను పచ్చని ఒలీవ మొక్కలా ఉన్నాను. నేను శాశ్వతంగా ఎప్పటికీ దేవుని ప్రేమనే నమ్ముకొన్నాను. దేవా, నీవు చేసిన వాటి మూలంగా నేను నిన్ను శాశ్వతంగా స్తుతిస్తాను. నీ అనుచరుల సముఖములో నీవు మంచివాడవని నేను ప్రకటిస్తాను.

షేర్ చేయి
కీర్తనలు 52 TERV

కీర్తనలు 52:6-9 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

నీతిమంతులు చూచి భయభక్తులుకలిగి –ఇదిగో దేవుని తనకు దుర్గముగా నుంచుకొనక తన ధనసమృద్ధియందు నమ్మిక యుంచి తన చేటును బలపరచుకొనినవాడు వీడేయని చెప్పు కొనుచు వానిని చూచి నవ్వుదురు. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టువలె నున్నాను నిత్యము దేవుని కృపయందు నమ్మిక యుంచుచున్నాను నీవు దాని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను స్తుతించెదను. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది నేను దాని స్మరించి కనిపెట్టుచున్నాను.

షేర్ చేయి
కీర్తనలు 52 TELUBSI