కీర్తనలు 50:7-10
కీర్తనలు 50:7-10 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
“నా ప్రజలారా! వినండి. నేను మాట్లాడతాను; ఇశ్రాయేలు, మీకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తాను: నేను దేవుడను, మీ దేవుడను. మీ బలుల గురించి లేదా ఎప్పుడు నా ఎదుటే ఉండే మీ దహనబలుల గురించి, నేను మీకు వ్యతిరేకంగా ఎటువంటి ఆరోపణలు చేయను. మీ శాలలోనుండి మీరు తెచ్చే ఎద్దులు నాకవసరం లేదు. మీ దొడ్డిలోని మేకపోతులు నాకవసరం లేదు. అడవిలో ఉన్న ప్రతి జంతువు నాదే వేయి కొండలపై ఉన్న పశువులు నావే.
కీర్తనలు 50:7-10 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నా ప్రజలారా, వినండి. నేను మాట్లాడతాను. నేను దేవుణ్ణి. మీ దేవుణ్ణి. నీ బలుల విషయమై నేను నిన్ను నిందించడం లేదు. మీ దహనబలులు ఎప్పుడూ నా ఎదుటే ఉన్నాయి. నీ ఇంటి నుండి ఎద్దునైనా, నీ మందలోని మేకపోతులనైనా నేను తీసుకోను. ఎందుకంటే అడవిలో ఉన్న ప్రతి మృగమూ నాదే. వెయ్యి కొండలపై తిరుగాడే పశువులన్నీ నావే.
కీర్తనలు 50:7-10 పవిత్ర బైబిల్ (TERV)
దేవుడు చెబుతున్నాడు: “నా ప్రజలారా, నా మాట వినండి. ఇశ్రాయేలు ప్రజలారా, మీకు విరోధంగా నా రుజువును కనపరుస్తాను. నేను దేవుణ్ణి, మీ దేవుణ్ణి. నేను మీ బలుల విషయంలో మిమ్ములను సరిచేయటంలేదు. గద్దించటంలేదు. ఇశ్రాయేలు ప్రజలారా, మీరు మీ దహన బలులను ఎల్లప్పుడూ తెస్తున్నారు. ప్రతిరోజు వాటిని మీరు నాకిస్తున్నారు. మీ ఇంటినుండి ఎద్దులను తీసుకోను. మీ శాలలనుండి మేకలు నాకవసరం లేవు. ఆ జంతువులు నాకు అవసరం లేదు. అరణ్యంలో ఉన్న జంతువులన్నీ ఇది వరకే నా సొంతం. వేలాది పర్వతాల మీద జంతువులన్నీ ఇది వరకే నా సొంతం.
కీర్తనలు 50:7-10 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నా జనులారా, నేను మాటలాడబోవుచున్నాను ఆల కించుడి ఇశ్రాయేలూ, ఆలకింపుము నేను దేవుడను నీ దేవు డను నేను నీ మీద సాక్ష్యము పలికెదను నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుటలేదు నీ దహనబలులు నిత్యము నాయెదుట కనబడుచున్నవి. నీ యింటనుండి కోడెనైనను నీ మందలోనుండి పొట్టేళ్లనైనను నేను తీసికొనను. అడవిమృగములన్నియు వేయికొండలమీది పశువులన్నియు నావేగదా