కీర్తనలు 47:1-9 - Compare All Versions

కీర్తనలు 47:1-9 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

సర్వ దేశాల్లారా, చప్పట్లు కొట్టండి; దేవునికి ఆనందంతో కేకలు వేయండి. మహోన్నతుడైన యెహోవా భయంకరుడు, భూమి అంతటికి ఆయన గొప్ప రాజు. ఆయన దేశాలను మన వశం చేశారు, జనాలను మన పాదాల క్రింద ఉంచారు. మన వారసత్వాన్ని మన కోసం ఏర్పాటు చేశారు. అది తాను ప్రేమించిన యాకోబు గర్వకారణము. సెలా దేవుడు జయధ్వనుల మధ్య ఆరోహణమయ్యారు, యెహోవా బూరధ్వనుల మధ్య ఆరోహణమయ్యారు. దేవునికి స్తుతి గానాలు చేయండి, స్తుతులు పాడండి; మన రాజుకు స్తుతి గానాలు చేయండి, స్తుతులు పాడండి. దేవుడు భూమి అంతటికి రాజు; ఆయనకు స్తుతికీర్తన పాడండి. దేవుడు దేశాలను పరిపాలిస్తున్నారు; దేవుడు తన పవిత్ర సింహాసనం మీద ఆసీనుడై ఉన్నారు. దేశాల అధిపతులు సమకూడతారు అబ్రాహాము దేవుని ప్రజలుగా సమకూడతారు భూమి మీద డాళ్లు దేవునికి చెందినవి; ఆయన గొప్పగా హెచ్చింపబడ్డారు.

షేర్ చేయి
కీర్తనలు 47 TSA

కీర్తనలు 47:1-9 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

జాతులన్నీ చప్పట్లు కొట్టండి. విజయోత్సాహంతో ఆనంద ధ్వనులు చేయండి. అత్యున్నతుడైన యెహోవా భయంకరమైనవాడు. భూమి అంతటికీ ఆయన మహారాజు. ఆయన జాతులను మనకు లోబరుస్తాడు. దేశాలను మన కాళ్ళ కిందకు తీసుకువస్తాడు. మన వారసత్వాన్ని ఎంపిక చేస్తాడు. అది తాను ప్రేమించిన యాకోబు కీర్తి ప్రతిష్టల వారసత్వం. దేవుడు గొప్ప ధ్వనితో ఆరోహణం అయ్యాడు. బాకా శబ్దంతో యెహోవా ఆరోహణం అయ్యాడు. దేవునికి స్తుతులు పాడండి. స్తుతించండి. మన రాజుకు స్తుతులు పాడండి, స్తుతులు పాడండి. ఎందుకంటే మన దేవుడు భూమి అంతటికీ రాజు. అవగాహనతో స్తుతులు పాడండి. దేవుడు అన్ని జాతులల పైనా పరిపాలన చేస్తున్నాడు. ఆయన తన పవిత్ర సింహాసనంపై కూర్చుని ఉన్నాడు. జాతుల అధిపతులు అబ్రాహము దేవుని ప్రజలతో కూడి ఉన్నారు. భూమిపై రక్షణ డాళ్ళు దేవునికే చెందుతాయి. భూమిపై అత్యున్నత స్థానం ఆయనదే.

షేర్ చేయి
కీర్తనలు 47 IRVTEL

కీర్తనలు 47:1-9 TERV (పవిత్ర బైబిల్)

సర్వజనులారా, చప్పట్లు కొట్టండి. సంతోషంగా దేవునికి కేకలు వేయండి. మహోన్నతుడగు యెహోవా భీకరుడు. భూలోకమంతటికీ ఆయన రాజు. ఆయన ప్రజలను మనకు లోబరిచాడు. ఆ రాజ్యాలను మన పాదాల క్రింద ఉంచాడు. దేవుడు మన కోసం మన దేశాన్ని కోరుకున్నాడు. యాకోబు కోసం అద్భుత దేశాన్ని ఆయన కోరుకున్నాడు. యాకోబు ఆయన ప్రేమకు పాత్రుడు. బూర మ్రోగగానే, యుద్ధనాదం వినబడగానే యెహోవా దేవుడు లేచాడు. దేవునికి స్తుతులు పాడండి. స్తుతులు పాడండి. మన రాజుకు స్తుతులు పాడండి. స్తుతులు పాడండి. దేవుడు సర్వలోకానికి రాజు. స్తుతిగీతాలు పాడండి. దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద కూర్చున్నాడు. దేవుడు సకల రాజ్యాలనూ పాలిస్తున్నాడు. రాజ్యాల నాయకులు దేవుని ప్రజలతో సమావేశమయ్యారు. దేవుని ప్రజలు అబ్రాహాము వంశస్థులు. వారి జనాంగమును దేవుడు కాపాడును. నాయకులందరూ దేవునికి చెందినవారు. దేవుడు మహోన్నతుడు.

షేర్ చేయి
కీర్తనలు 47 TERV

కీర్తనలు 47:1-9 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

సర్వజనులారా, చప్పట్లు కొట్టుడి జయధ్వనులతో దేవునిగూర్చి ఆర్భాటము చేయుడి. యెహోవా మహోన్నతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి మహారాజై యున్నాడు. ఆయన జనములను మనకు లోపరచును మన పాదముల క్రింద ప్రజలను అణగద్రొక్కును. తాను ప్రేమించిన యాకోబునకు మహాతిశయాస్పద ముగా మన స్వాస్థ్యమును ఆయన మనకొరకు ఏర్పాటు చేసియున్నాడు. దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయెను బూరధ్వనితో యెహోవా ఆరోహణమాయెను. దేవుని కీర్తించుడి కీర్తించుడి మన రాజును కీర్తించుడి కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజై యున్నాడు రమ్యముగా కీర్తనలు పాడుడి. దేవుడు అన్యజనులకు రాజై యున్నాడు దేవుడు తన పరిశుద్ధిసంహాసనముమీద ఆసీనుడై యున్నాడు. జనముల ప్రధానులు అబ్రాహాముయొక్క దేవునికి జనులై కూడుకొనియున్నారు.

షేర్ చేయి
కీర్తనలు 47 TELUBSI