కీర్తనలు 41:4-5
కీర్తనలు 41:4-5 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
“యెహోవా, నన్ను కరుణించండి; నన్ను స్వస్థపరచండి, మీకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను.” నా శత్రువులు, “వీడెప్పుడు చస్తాడు, వీని పేరు ఎప్పుడు చెరిగిపోతుంది?” అని నా గురించి చెప్పుకుంటున్నారు.
కీర్తనలు 41:4-5 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నేనిలా అన్నాను. యెహోవా, నీకు విరోధంగా నేను పాపం చేశాను. నన్ను కనికరించు. నా హృదయాన్ని బాగుచెయ్యి. నా శత్రువులు నాకు వ్యతిరేకంగా చెడ్డ మాటలు అంటారు, వాడు ఎప్పుడు చచ్చిపోతాడు? వాడి పేరు ఎప్పుడు మాసిపోతుంది? అంటారు.
కీర్తనలు 41:4-5 పవిత్ర బైబిల్ (TERV)
నేను చెప్పాను, “యెహోవా, నాకు దయ చూపించుము. నేను నీకు విరోధంగా పాపం చేసాను. కాని నన్ను క్షమించి నన్ను బాగుచేయుము.” నా శత్రువులు నన్ను గూర్చి చెడు సంగతులు పలుకుతున్నారు. “వీడెప్పుడు చచ్చి మరువబడుతాడు?” అని వారంటున్నారు.
కీర్తనలు 41:4-5 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
–యెహోవా నీ దృష్టియెదుట నేను పాపము చేసి యున్నాను నన్ను కరుణింపుము నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసియున్నాను. అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డమాట లాడుచున్నారు –వాడు ఎప్పుడు చచ్చును? వాని పేరు ఎప్పుడు మాసిపోవును? అని చెప్పుకొనుచున్నారు.